గ్రీన్‌ టీ వర్సెస్‌ మునగాకు టీ.. వేగంగా బరువు తగ్గాలంటే ఏది బెటర్..!

ప్రస్తుత రోజుల్లో చాలా మంది అధిక బరువు, ఉబకాయంతో బాధపడుతున్నారు. బరువు తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా ఆహారంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. వివిధ రకాల ఆహారాలు, హెల్తీ డ్రింక్స్‌, డిటాక్స్‌ డ్రింక్స్‌ వంటివి చేర్చుకుంటారు. బరువు తగ్గడానికి గ్రీన్ టీ, మోరింగ టీ కూడా తీసుకుంటారు. కానీ ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది..?

గ్రీన్‌ టీ వర్సెస్‌ మునగాకు టీ.. వేగంగా బరువు తగ్గాలంటే ఏది బెటర్..!
Moringa Tea Or Green Tea

Updated on: Sep 25, 2025 | 5:10 PM

బరువు తగ్గడానికి గ్రీన్ టీ, మోరింగ టీ రెండూ తాగుతారు. మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే ఈ రెండింటిలో ఏది తాగాలి? నిపుణులు ఏం చెబుతున్నారంటే.. గ్రీన్ టీలో కాటెచిన్స్, కెఫిన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచుతాయి. శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడతాయి. ఆకలిని తగ్గిస్తుంది. కానీ మోరింగా టీ పూర్తిగా కెఫిన్ లేనిది. కాబట్టి మీరు కెఫిన్‌కు దూరంగా ఉండాలనుకుంటే మునగాకు టీ మంచిదని నిపుణులు చెబుతున్నారు.

గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో కొవ్వు ఆక్సీకరణ పెరుగుతుందని, తద్వారా కొవ్వు వేగంగా కరుగుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. రోజూ గ్రీన్‌టీ తాగడం వల్ల మన జీవక్రియ కూడా వేగవంతం అవుతుంది.

మోరింగ టీని మోరింగ ఆకుల(మునగ ఆకులు) నుండి తయారు చేస్తారు. మునగాకు టీలో ఐరన్, కాల్షియం, పొటాషియం, విటమిన్లు ఎ, సి, ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరానికి పోషణను అందిస్తుంది. గ్రీన్ టీలో పోషకాలు తక్కువగా ఉంటాయి. కేవలం యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మునగాకు టీలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. తరచుగా చిరుతిళ్లు, అతిగా తినడం నివారించడానికి సహాయపడుతుంది.

మునగ టీలో క్లోరోజెనిక్ ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. తద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటుంది. పేగులను శుభ్రంగా ఉంచడంలో, ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించడంలో మునగాకు టీ బాగా పని చేస్తుంది. ఇది కడుపులో ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

గ్రీన్ టీ కూడా కడుపుకు మంచిది. కానీ, ఖాళీ కడుపుతో తాగడం కొంత చికాకు కలిగిస్తుంది. గ్రీన్‌ టీలో థర్మోజెనిక్ ప్రభావం అంటే వేడిని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఫ్యాట్ బర్నింగ్ ను పెంచుతుంది. దీనిలోని కెఫిన్, కాటెచిన్లు కొవ్వును కాల్చడాన్ని వేగవంతం చేస్తాయి. వ్యాయామంతో కలిపితే ఇది కేలరీలను వేగంగా బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ఫలితాలు వేగంగా కనిపిస్తాయి. మోరింగా టీ ప్రభావం కొంచెం నెమ్మదిగా ఉంటుంది.

అదే సమయంలో మోరింగ టీ ప్రభావం నెమ్మదిగా ఉంటుంది. కానీ, దీర్ఘకాలిక ప్రయోజనకరంగా పనిచేస్తుంది. దీనిలో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు జీవక్రియను సమతుల్యం చేస్తాయి. శరీరాన్ని లోపలి నుండి ఆరోగ్యంగా, బలంగా చేస్తాయి.

వేగంగా బరువు తగ్గాలనుకుంటే, కెఫిన్ తో సమస్యలు లేకపోతే, గ్రీన్ టీ ప్రభావవంతంగా ఉంటుంది. సహజమైన, పోషకాలు అధికంగా ఉండే, కెఫిన్ లేని టీ కావాలనుకుంటే..మునగాకు టీ మంచిది. మునగ టీ తాగడం వల్ల బరువు నెమ్మదిగా క్రమంగా తగ్గవచ్చు. కానీ, గ్రీన్ టీ తాగడం వల్ల వేగంగా బరువు తగ్గడం కనిపిస్తుంది. అందువల్ల బరువు తగ్గడానికి గ్రీన్ టీ ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.