ఎండాకాలం మొదలైంది.. మార్చినెలలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఎండవేడిమి, ఉక్కపోత, దాహం కారణంగా ప్రజలు కొబ్బరి బొండాలు, నిమ్మరసం, చెరుకురసం, పుదీనా వాటర్ వంటి అనేక రకాల కూల్‌డ్రింక్స్ తాగుతుంటారు. మరికొందరు వేసవిలో ఉపశమనం కోసం చల్ల చల్లని బీర్ లాగించేస్తుంటారు. అయితే, బీరు తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు కూడా చెబుతున్నారు. ఇది వింటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమేనంటున్నారు నిపుణులు. ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల ఆరోగ్య పరంగా నష్టాలు ఉన్నప్పటికీ, కొన్ని సార్లు మితంగా తీసుకునే ఆల్కాహాల్ కూడా ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలను అందిస్తుందని చెబుతున్నారు. బీరును మితంగా తీసుకోవడంవల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. బీర్ ను మితంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, జీర్ణక్రియ మెరుగుపడుతుందని చెబుతున్నారు. అసలు బీర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
వేసవిలో బీర్ బెస్ట్ డ్రింక్ అంటున్నారు నిపుణులు. బీర్‌లో నీరు సమృద్ధిగా ఉంటుంది. శరీరానికి అవసరమైన ఖనిజాలు కూడా ఉన్నాయి. మితంగా తీసుకునే బీర్ వల్ల మీ మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. బీరును తక్కువ మొత్తంలో తీసుకోవడంవల్ల ఒత్తిడి తగ్గడంతోపాటు ఆందోళనను తగ్గిస్తుందని చెబుతున్నారు. బీరులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల డీహైడ్రేషన్‌ను నివారించడంలో సహాయపడుతుంది. అంతేకాదు, బీర్‌లో బి విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. బీర్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. మితంగా బీర్ తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. బీర్ మితంగా తీసుకుంటే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బీర్‌లో ఉండే కరిగే ఫైబర్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణక్రియకు దోహదపడతాయి.
బీర్ మితంగా తీసుకోవడంవల్ల మధుహేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు. బీర్ తాగటం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఒక అధ్యయనం ప్రకారం, బీర్ మితంగా తాగేవారిలో మధ్య వయస్కులు, వృద్దుల్లో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని నివారిస్తుందని సూచించారు. అంతేకాదు, బీర్‌లోని సిలికాన్ ఎముకల ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీర్ అనేది డైటరీ సిలికాన్ మూలం. ఇది ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైన ఖనిజం. అప్పుడు బీర్ మితంగా తాగడం వల్ల ఎముకల సాంద్రత పెరగడంతోపాటు ఎముకలు పలచబడటాన్ని నిరోధిస్తుంది. ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవ్చని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. బీర్‌లోని ఎలక్ట్రోలైట్స్ వ్యాయామం తర్వాత కండరాల పునరుత్పత్తికి సహాయపడతాయి.
గుర్తుంచుకోవలసిన విషయాలు..
మితంగా తాగడం ముఖ్యం. బీర్‌లో ఆల్కహాల్ ఉన్నందున, అతిగా తాగడం ఆరోగ్యానికి హానికరం. అలాగే, వేడిలో బయట తాగవద్దు. వేడిలో బయట బీర్ తాగడం వల్ల డీహైడ్రేషన్, హీట్‌స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. గర్భిణీ స్త్రీలు, కాలేయ వ్యాధి ఉన్నవారు, మధుమేహం ఉన్నవారు బీర్ తాగకూడదు. ప్రతిరోజూ బీర్ తాగడం ఆరోగ్యానికి మంచిదని పోర్చుగీస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాత్రి భోజనంలో బీర్ తాగడం వల్ల పురుషుల కడుపులో మంచి బ్యాక్టీరియా పెరుగుతుందని తెలిసింది. అయితే, వేసవిలో మితంగా బీర్ తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కానీ అతిగా తాగడం ఆరోగ్యానికి హానికరం.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..