
మగవారిలో శృంగార సామర్థ్యం తగ్గిపోవడం ఈ మధ్య చాలా కామన్ సమస్య అయిపోయింది. మరికొందరు అంగ స్తంభన, శృంగారంపై ఆసక్తి లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇందుకు వయస్సు పెరగడం, టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిలు పడిపోవడమే కారణాలుగా సాధారణంగా భావిస్తారు. అయితే తాజా పరిశోధనలు కొత్త విషయాలను తెలియజేశాడు. రక్తంలో గ్లూకోజు (చక్కెర) స్థాయిలు స్వల్పంగా పెరగడం కూడా శృంగార ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని రీసెర్చ్‌లో తేలింది.
ఈ పరిశోధనల ప్రకారం… షుగర్ వచ్చినట్లుగా పరిగణించాల్సినంత గ్లూకోజ్ పెరగకున్నా.. ఒకింత గ్లూకోజు స్పైక్ అయినా కూడా స్పెర్మ్ కణాల వేగాన్ని మందగింపజేస్తుంది. దీంతో పురుషులలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గే చాన్స్ ఉంది. అంతేకాదు… అంగ స్తంభన సమస్యలు, శృంగార ఆసక్తి తగ్గిపోయే లక్షణాలు కూడా కనిపించే అవకాశముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఇకపై మగవారికి శృంగార ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, కేవలం టెస్టోస్టిరాన్ మోతాదులు సరిగ్గా ఉండాలనే కాదు… రక్తంలో గ్లూకోజ్‌ను కూడా నార్మల్‌గా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, వర్కువుట్స్ వంటి అంశాలను తగినట్టుగా మార్చుకుంటే ఈ సమస్యలను ముందే నివారించవచ్చని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..