
ముఖం అందంగా, మిళ మిళ మెరవాలని జనాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. మార్కెట్‌లో దొరికే రకరకాల ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఇందుకోసం చాలా డబ్బులు ఖర్చు చేస్తారు. కానీ మన వంటగధిలో దొరికే పసుపు, కొబ్బరిపాలు, రోజ్‌వాటర్ వంటి సహజ పదార్థాలను ఉపయోగించి మన ముఖాన్ని సులభంగా మెరిసేలా చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. అవును ఈ మూడు పదార్థాలను సరైన మొతాదులో తీసుకొని.. వాటి మూడింటి మిశ్రమంతో క్యూబ్ తయారు చేసుకొని ముఖానికి రాసుకోవడం ద్వారా చర్మాన్ని మెరిసేలా చేసుకొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
ఐస్‌క్యూబ్ ఫేస్ మసాజర్
మీరు ఇంట్లోనే ఐస్‌క్యూబ్ ఫేస్ మసాజర్‌ను తయారు చేసుకునేందుకు ముందుగా ఒక టీస్పూను పసుపు, ముల్తానీ మట్టి, ఆరెంజ్ పీల్ పౌడర్‌ను తీసుకొని ఒక కప్‌లో వేసుకోండి. తర్వాత కప్పు రోజ్‌వాటర్, టీస్పూను కొబ్బరిపాలు, ఆరు చుక్కల నిమ్మనూనెను ఆ కప్‌లో వేసి బాగా కలపండి. తర్వాత ఆ మిశ్రమాన్ని ఐస్‌క్యూబ్స్ తయారు చేసే ట్రేలోపోసి డీ ప్రిజ్‌లో పెట్టండి. అవి ఐస్ క్యూబ్‌లా మారుతాయి.
ఐస్ క్యూబ్ ఎలా యూజ్ చేయాలి?
మీరు ఇప్పుడు తయారు చేసుకున్న ఐస్ క్యూబ్స్‌ను వారం రోజుల వరకు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుకోవచ్చు. వీటిని ఎలా వాడాలంటే.. రోజు మార్నింగ్ మీరు ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని ఈ ఐస్ క్యూబ్‌తో 20 నిమిషాల పాటు ఫేస్ మసాజ్ చేసుకోండి. తర్వాత మరోసారి నీటితో శుభ్రంగా కడిగి తడి లేకుండా కాటన్ క్లాత్‌తో తుడుచుకోండి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్‌ను రెండింటిలో ఏదో ఒకటి ఫేస్‌పై అప్లై చేయండి.
మెరిసే, అందమైన చర్మం కోసం
ఈ చిట్కాను మీరు క్రమం తప్పకుండా పాటిస్తే మీ ఫేస్‌పై పేరుకుపోయన మొండి మరకలు, నల్లమచ్చలు, వైట్, బ్లాక్ హెడ్స్ వంటికి పోయి మీ ముఖం ప్రకాశవంతంగా, మెరుస్తూ ఎప్పుడూ తాజాగా కనిపిస్తుంది. అంతేకాదు మీ చర్మం జిడ్డుగా మారకుండా నియంత్రిస్తుంది. చాలా కాలంగా ఉన్న మొటిమలు కూడా తొలగిపోతాయి. ఎందుకంటే పసుపులో ఉండే పోషకాలు వృద్ధాప్య ఛాయలను తగ్గించి చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
Note: ఈ వ్యాపంలో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వాటిని పాటించే ముందు నిపుణులు సలహా కచ్చితంగా తీసుకోండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.