Girls Rejected: మీరు ఒక అమ్మాయికి ప్రపోజల్ చేయాలనుకుంటే ఒక్కసారి మీ అలవాట్లను పరిశీలించుకోండి. లేదంటే ఆమె మిమ్మల్ని రిజెక్ట్ చేయవచ్చు. అమ్మాయిలు ఏ అలవాట్లను ఇష్టపడతారో వేటిని ఇష్టపడరో తెలుసుకుంటే మంచిది. అబ్బాయిల ఈ 4 అలవాట్లను అమ్మాయిలు అస్సలు ఇష్టపడరు. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.
1. అమ్మాయిల ముందు అబ్బాయిలు హీరోగా గొప్పగా కనిపించాలనుకుంటారు కానీ అమ్మాయిలు ఇటువంటి ప్రవర్తన గలవారిని ఇష్టపడరు. మాట్లాడే విషయంలో గొడవపడే అబ్బాయిలను కూడా తిరస్కరిస్తారు. అబ్బాయిలు తమ భద్రత, ఆత్మరక్షణ కోసం పోరాడే అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడతారు.
2. సిగరెట్లు, మద్యం మొదలైన అలవాట్లున్న అబ్బాయిలను.. అమ్మాయిలు 4 అడుగుల దూరంలో ఉంచుతారు. వారిని బాధ్యత లేని అబ్బాయిలుగా పరిగణిస్తారు. ఎందుకంటే తాగిన మైకంలో వారు తప్పులు చేస్తారు అందుకే వారికి దూరంగా ఉంటారు.
3. చాలామంది అమ్మాయిలు పరిశుభ్రతను ఇష్టపడతారు. శుభ్రంగా లేని అబ్బాయిలను ఇష్టపడరు. దుస్తులు, దంతాలు శుభ్రంగా ఉండాలి. లేదంటే వారి దరికి కూడా రానివ్వరు. మాట్లాడటానికి అస్సలు ఇష్టపడరు.
4. చాలా మంది అబ్బాయిలు అసభ్యకరంగా మాట్లాడే అలవాటు కలిగి ఉంటారు. మహిళలను కించపరుస్తూ మాట్లాడతారు. అటువంటి వారిని ఏ అమ్మాయి ఇష్టపడదు. అమ్మాయిలు ఎల్లప్పుడూ మంచి అబ్బాయిలను ఇష్టపడతారు.
5. ఒకవేళ మీరు అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకుంటే ముందుగా ఈ 4 అలవాట్లను మెరుగుపరుచుకోండి. ఆ తర్వాత అమ్మాయిని కలవండి. లేదంటే తిరస్కరణకు గురవుతారు.