Relationship News: నేటి కాలంలో అమ్మాయిలు మునుపటి కంటే చాలా తెలివికలవారు. స్నేహం, ప్రేమ, పెళ్లి విషయంలో చాలా క్లారిటీగా వ్యవహరిస్తున్నారు. తనకి కాబోయే వరుడిని ఏరికోరి మరీ ఎంచుకుంటున్నారు. అబ్బాయిల మాదిరిగానే అమ్మాయిలు కూడా తమ కిష్టమైన వరుడిని ఎంచుకునేటప్పుడు కొన్ని లక్షణాలను గమనిస్తారు. ఆ లక్షణాలు లేకుంటే అస్సలు రాజీపడరు. మరి ఎలాంటి లక్షణాలున్న అబ్బాయిలను ఇష్టపడుతారో పరిశీలిద్దాం. జర్మనీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ జోట్టింగెన్, ఫిమేల్ హెల్త్ యాప్ క్లూ అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. రీసెర్చ్ ప్రకారం.. అమ్మాయిలు భాగస్వామిని ఎంచుకునే సమయంలో పొడవుగా ఉన్న అబ్బాయిలపై శ్రద్ధ చూపుతారు. దీనికి కారణం పొడవైన అబ్బాయిలు తమకు మంచి జోడిగా అనుకుంటారు. వారితో నడిచేటప్పుడు సురక్షితంగా భావిస్తారు.
పొడవైన అబ్బాయిలు మొదటి ఎంపిక
పొడవైన అబ్బాయిలను చూసి అమ్మాయిలు త్వరగా ఇంప్రెస్ అవుతారు. తమ కంటే తక్కువ ఎత్తు ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలకి ఇష్టం ఉండదు. అధ్యయనం ప్రకారం..72 శాతం మంది మహిళలు ఆచరణాత్మకమైన, సౌకర్యవంతమైన స్వభావం గల భాగస్వామి కోసం చూస్తారు. హృదయ శుద్ధి, ఇతరులను గౌరవించడం తెలిసిన వారిని 60 శాతం మంది ఇష్టపడుతారు. కొద్దిమంది డబ్బున్న అబ్బాయిలను ఇష్టపడుతారు. 25 శాతం మంది అమ్మాయిలు మతం, ఆరాధనలను నమ్మే అబ్బాయిలను ఇష్టపడుతారని తేలింది. అమ్మాయిలు తమ కుటుంబంతో పాటు ఇతర కుటుంబాలను గౌరవించే అబ్బాయిలను ఇష్టపడతారని పరిశోధనలో తేలింది. అబ్బాయిలు ధరించే దుస్తులు, వ్యక్తిత్వంపై కూడా అమ్మాయిలు చాలా శ్రద్ధ చూపుతారు. తెలివి తక్కువ అబ్బాయిలని అమ్మాయిలు ఇష్టపడరు. శ్రద్ధగల, బాధ్యతగల అబ్బాయిలను జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ప్రతి అమ్మాయి కలలు కంటుంది.