
గిలోయ్.. దీనినే తిప్పతీగా అని పిలుస్తారు.. ఆయుర్వేదంలో తిప్పతీగను అమృతంతో సమానమైనదిగా భావిస్తారు. ఇది శతాబ్దాలుగా వివిధ ఆరోగ్య సమస్యలకు అద్భుతమైన ఔషధంగా ఉపయోగించబడుతోంది. గిలోయ్ జ్యూస్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా దీనిని 15 రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే.. మీ శరీరంలో జరిగే మార్పులను మీరు ఊహించలేరు. ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, ఇమ్యునోమోడ్యులేటరీ వంటి అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. ఈ లక్షణాల కారణంగా, జ్వరం, జలుబు, దగ్గు, మధుమేహం, కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు వంటి వివిధ ఆరోగ్య సమస్యలను తరిమికొడుతుంది. అయితే, ఈ తిప్పతీగ జ్యూస్ ఎవరికి ఎక్కువ మేలు చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..
ఖాళీ కడుపుతో గిలోయ్ జ్యూస్ తాగటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో గిలోయ్ జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. డయాబెటిక్ రోగులకు తిప్పతీగ రసం ఒక వరం లాంటిది. కడుపు సంబంధిత సమస్యల నుండి బయటపడటానికి, మీరు ప్రతిరోజూ గిలోయ్ రసం తాగాలి. అంతేకాదు..చర్మంపై ముడతలు, ఫైన్ లైన్స్ సమస్య నుండి బయటపడవచ్చు.
గిలోయ్ ఆకులను జ్యూస్ చేసి కొద్దిగా తేనె కలిపి తాగవచ్చు. లేదా గోరు వెచ్చని నీటిలో గిలోయ్ పౌడర్ కలుపుకుని తాగవచ్చు. గిలోయ్ జ్యూస్ తాగడం వల్ల హార్మోన్ లెవెల్స్ బ్యాలెన్స్ చేయవచ్చు. ఆయుర్వేదంలో గిలోయ్ జ్యూస్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పీసీఓఎస్ సమస్యను నియంత్రించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. పీసీఓఎస్ సమస్యకు ఆయుర్వేదంలో మంచి చికిత్స ఉంది. గిలోయ్ జ్యూస్ ఇందుకు చాలా దోహదపడుతుంది. పీసీఓడీ, పీసీఓఎస్ ప్రభావం గర్భిణీ మహిళలపై పడుతుంది. జీవనశైలిలో మార్పు తీసుకొస్తే నియంత్రించవచ్చు.
ముఖ్యంగా 16-35 ఏళ్ల మహిళలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఓవరీలో క్రాంప్స్ కారణంగా ఈ సమస్య ఉత్పన్నమౌతుంది. ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది మహిళలు పీసీఓడీ, పీసీఓఎస్ సమస్యను ఎదుర్కొంటుంటారు. తిప్పతీగ శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. జ్వరానికి మేలు చేస్తుంది. జ్వరం, దగ్గు, జలుబును త్వరగా తగ్గేలా చేస్తుంది. తిప్పతీగ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. అంతేకాదు..తిప్పతీగ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. తిప్పతీగ రసం శరీరం నుండి విషాన్ని కూడా తొలగిస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..