ట్రావెలింగ్ అంటే ఇష్టమా.. ఈ ప్రదేశాల్లో నివాసం, ఆహారం అన్నీ ఉచితం.. జేబుపై భారం పడదు..

|

Jul 13, 2024 | 11:32 AM

ప్రయాణాలు చేసే సమయంలో తినడం, తాగడం వంటివి బడ్జెట్‌లోనే చేయగలిగితే అది వేరే విషయం. అయితే అందరి ఆర్ధిక పరిస్థితి ఒకలా ఉండదు. కొంతమందికి తమ ఫ్యామిలీతో కలిసి తక్కువ ఖర్చుతో ఎక్కడికైనా ప్రయాణించాలని ప్లాన్ చేసుకుంటారు. అలాంటి వారు భారతదేశంలోని కొన్ని ప్రదేశాలను చాలా తక్కువ ఖర్చుతో సందర్శించవచ్చు. ఈ ప్రదేశాల్లో నివసించడానికి పూర్తిగా ఉచితం. అంతేకాదు ఇక్కడ ఆహారం, పానీయాల కోసం ఎటువంటి ఖర్చు చేయాల్సిన పని ఉండదు.

ట్రావెలింగ్ అంటే ఇష్టమా.. ఈ ప్రదేశాల్లో నివాసం, ఆహారం అన్నీ ఉచితం.. జేబుపై భారం పడదు..
Free Places Of India
Follow us on

ప్రయాణించడానికి ఇష్టపడని వారు ఎవరుంటారు? ప్రతినెలా ఏదో ఒక సాకుతో ఒక చోట నుంచి మరొక చోటకు ప్రయాణం చేస్తుంటారు. అయితే ఇలా ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్ళిన . తర్వాత అక్కడ ఉండాలన్నా, భోజనం చేయాలన్నా హోటల్స్ ను ఆశ్రయించాల్సిందే. చాలాసార్లు ఖరీదైన హోటళ్ల కారణంగా తమ ప్రయాణ ప్రణాళికలను రద్దు చేసుకుంటారు. మీరు కూడా ఇలా ఆలోచించి ఎక్కడికైనా వెళ్ళాలనుకుని రెడీ అయ్యి.. ఆ ప్లాన్‌ను రద్దు చేసుకుంటున్నారా.. ఈ రోజు మేము మీకు ఉత్తమమైన సందర్శన ప్రదేశాల గురించి తెలియజేస్తున్నాం..

ప్రయాణాలు చేసే సమయంలో తినడం, తాగడం వంటివి బడ్జెట్‌లోనే చేయగలిగితే అది వేరే విషయం. అయితే అందరి ఆర్ధిక పరిస్థితి ఒకలా ఉండదు. కొంతమందికి తమ ఫ్యామిలీతో కలిసి తక్కువ ఖర్చుతో ఎక్కడికైనా ప్రయాణించాలని ప్లాన్ చేసుకుంటారు. అలాంటి వారు భారతదేశంలోని కొన్ని ప్రదేశాలను చాలా తక్కువ ఖర్చుతో సందర్శించవచ్చు. ఈ ప్రదేశాల్లో నివసించడానికి పూర్తిగా ఉచితం. అంతేకాదు ఇక్కడ ఆహారం, పానీయాల కోసం ఎటువంటి ఖర్చు చేయాల్సిన పని ఉండదు.

మణికరణ్ సాహిబ్

హిమాచల్ ప్రదేశ్ ఎల్లప్పుడూ భారతీయ ప్రజలకు ఇష్టమైన ప్రయాణ గమ్యస్థానంగా ఉంది. ఇక్కడికి స్థానికులతో పాటు విదేశీయులు కూడా భారీ సంఖ్యలో వస్తుంటారు. ఈ ప్రదేశం సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. మీరు హిమాచల్‌ ప్రదేశ్ ను సందర్శించాలనుకుంటే గురుద్వారా మణికరణ్ సాహిబ్‌ని తప్పక సందర్శించండి. ఇక్కడ వసతి, ఆహారంతో పాటు మంచి సౌకర్యాలు లభిస్తాయి. వీటికి ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇవి కూడా చదవండి

భారత్ హెరిటేజ్ సర్వీసెస్

భారత్ హెరిటేజ్ సర్వీసెస్ రిషికేశ్‌లోని ఉత్తమ ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ప్రజలు ప్రశాంత వాతావరణంలో గడపడానికి ఇక్కడికి వస్తుంటారు. విశేషమేమిటంటే ఇక్కడ కూడా నివసించడానికి ఎటువంటి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అంతేకాదు తినే ఆహారం, పానీయాలు పూర్తిగా ఉచితం. అయితే ప్రతిఫలంగా ఇక్కడ ఉండేవారు కొంత స్వచ్ఛందంగా పని చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉంటూ రిషికేశ్ అందాలను దేవాలయాలను సందర్శించవచ్చు.

పరమార్థ నికేతన్

రిషికేశ్‌లోని అందమైన ఆశ్రమాల్లో పరమార్థ నికేతన్ కూడా పరిగణించబడుతుంది. ఈ ప్రదేశం గంగా ఆరతికి ప్రసిద్ధి. మీరు ఏదైనా మతపరమైన పని కోసం ఇక్కడకు వెళ్తే.. పరమార్థ నికేతన్ లో ఉచితంగా ఉండగలరు. ఇక్కడ మీరు తినే ఆహారం, పానీయాల కోసం కూడా ఎటువంటి డబ్బులను చెల్లించాల్సిన అవసరం లేదు

రమణ మహర్షి ఆశ్రమం

తమిళనాడులోని అరుణాచలం పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తుంటే ఇక్కడ ఖచ్చితంగా రమణాశ్రమాన్ని సందర్శించండి. ఇక్కడ కూడా బస, ఆహారం పూర్తిగా ఉచితం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..