Health Tips: పండ్లు, కూరగాయలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

అన్ని కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార పదార్ధాలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. మరి ఫ్రిజ్‌లో పెట్టాల్సినవి.? పెట్టకూడనవి.? ఏంటో..

Health Tips: పండ్లు, కూరగాయలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి!
Fridge
Follow us

|

Updated on: Sep 24, 2022 | 12:32 PM

గుడ్లు, కూరగాయలు, పండ్లు, బ్రెడ్.. ఇలా ఏదైనా కూడా బయట నుంచి ఇంటికి తీసుకురాగానే.. అవి ఎక్కువకాలం ఫ్రెష్‌గా ఉండేందుకు కొందరు ఫ్రిజ్‌లో పెడుతుంటారు. మీరు అనుకుంటున్నది కరెక్టే..! పెట్టడమూ సమంజసమే.. కానీ అన్ని కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార పదార్ధాలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. పెట్టకూడనవి కూడా కొన్ని ఉన్నాయి. మరి ఫ్రిజ్‌లో పెట్టాల్సినవి.? పెట్టకూడనవి.? ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • టమాటా:

టమాటాలను ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడదు. వీటిని పెడితే.. అవి వాటి సహాజ గుణాలను కోల్పోతాయి. వాసన పోతుంది. వాటితో వంటకం చేస్తే రుచి ఉండదు.అందుకే టమాటాలను కచ్చితంగా రూమ్ టెంపరేచర్‌లోనే ఉంచాలి.

  • అరటిపండు:

అరటిపండ్లే కాదు, అరటికాయలు కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఫ్రిజ్‌లో పెట్టిన అనంతరం అరటిపండ్లు నల్లగా మారిపోతాయి. వాటి రుచిని కోల్పోతాయి. అందుకే అరటిపండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే.. తడిలేని ప్రదేశంలో ఉంచాలి.

  • అవకాడో:

అవకాడోలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అలా పెడితే.. వాటిలోని గుణాలు పోతాయి. రుచి కాస్తా మారిపోతుంది. ఎంతో ఖరీదైన అవకాడోలను గాలి ఉండే ప్రదేశంలో లేదా తడిలేని చోట్ల పెట్టాలి.

  • పుచ్చకాయ:

సగం కోసిన పుచ్చకాయను ఎప్పుడూ ఫ్రిజ్‌లో పెట్టకండి. చాలామంది ఈవిధంగా పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల దానిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ పోవడమే కాదు.. వాటిని తిన్నా మీకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు దక్కవు.

  • వంకాయ:

వంకాయలను బయట పెట్టడం కంటే.. ఫ్రిజ్‌లో పెడితేనే త్వరగా పాడైపోతాయి. అందుకే అలా అస్సలు చేయకండి.

  • ఉల్లిపాయ, వెల్లుల్లి:

వెల్లుల్లి ఫ్రిజ్‌లో ఉంటే జిగురు వస్తుంది. ఉల్లి కూడా అంతే!.. ఈ రెండు కూడా వెలుతురు, గాలి తగిలే చోట ఉంటేనే తాజాగా ఉంటాయి.

  • చాక్లెట్లు:

చాక్లెట్లను చాలామంది డీప్ ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అలా చేయడం వల్ల వాటి సహజసిద్దమైన రుచి, ఫ్లేవర్ కోల్పోతాయి. ఇక ఇలా ఫ్రిజ్‌లో పెట్టి చాక్లెట్లు తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.. వాటిని బయటపెట్టాలి. అది కూడా కాంతి రాని చోట ఉంచాలి.

  • గుడ్లు:

చాలామంది ఇళ్లల్లో ఎగ్ ట్రేస్ ఫ్రిజ్‌లో కనిపిస్తాయి. అయితే అలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు. గుడ్లు బయట ఉంటేనే మంచిది.

ఇవి మాత్రమే కాదు.. బ్రెడ్, బత్తాయి పండ్లు, తేనె, కాఫీ గింజలు, కెచప్, పీనట్ బటర్, దోసకాయలు, స్ట్రాబెర్రిస్ లాంటివి ఫ్రిజ్‌లో పెట్టకూడదు. వీటిని బయటే పెడితే మంచిది. అలాగే వారానికి సరపడా కూరగాయలు, పండ్లు తెచ్చుకుంటే బెటర్. ఎప్పటికప్పుడు తాజావి తెచ్చుకుంటుంటే అనారోగ్య సమస్యలు దరికి చేరవు.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం..

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!