
వంటింట్లో ఉండే ఎక్కువ పదార్థాలను ఫ్రిడ్జ్‌లో పెట్టడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. కానీ అందులో కొన్ని పదార్థాలు ఫ్రిడ్జ్‌లో పెట్టినప్పుడు పోషకాలు నశించవచ్చు. ఇంకా కొన్ని ఆరోగ్యానికి హాని కలిగించే స్థితికి చేరతాయి. కొన్ని పదార్థాలను ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల బ్యాక్టీరియా ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అలాంటి ఆహారాల గురించి తెలుసుకోవడం అవసరం.
వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే. కానీ దాన్ని వలిచిన తర్వాత ఫ్రిడ్జ్‌లో ఉంచడం చాలా ప్రమాదకరం. వెల్లుల్లిని వంట చేసేముందు పొట్టు తీయాలి. ముందే పొట్టు తీసి ఫ్రిడ్జ్‌లో ఉంచితే నిష్క్రియంగా మారుతుంది. వెల్లుల్లిలో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయి. అది పాడవడానికి అవకాశమూ ఎక్కువ. అందుకే వంట ముందు పొట్టు తీసి వెంటనే వాడాలి. ఇలా చేస్తే వెల్లుల్లి తాజాగా ఉంటుంది.
ఉల్లిపాయను సగం కోసిన తర్వాత మిగిలిన భాగాన్ని చాలా మంది ఫ్రిడ్జ్‌లో పెడతారు. ఇది ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే కోసిన భాగంపై వెంటనే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఆ ఫ్రిడ్జ్ వాతావరణంలో బ్యాక్టీరియా మరింత వేగంగా పెరుగుతుంది. ఆ ఉల్లిపాయను మళ్లీ వాడితే పేగులు, జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒకసారి కోసిన ఉల్లిపాయను వెంటనే వాడడం మంచిది.
అల్లం కూడా చాలా మంది ఫ్రిడ్జ్‌లో ఉంచుతారు. ఇది మంచి అలవాటు కాదు. అల్లంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో ఉంచినప్పుడు ఆ తేమ వలన అక్కడ బ్యాక్టీరియా ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. అల్లం లోపలే నల్లగా మారుతుంది. అలాగే దాని రుచి, సువాసన పోతాయి. వాడదగిన స్థితిలో ఉండదు. కాబట్టి అల్లాన్ని పొడి ప్రదేశంలో గాలి ఆడే చోట ఉంచడం మంచిది.
వండిన అన్నాన్ని చాలా మంది ఫ్రిడ్జ్‌లో రెండు మూడు రోజులు ఉంచుతారు. ఇది చాలా ప్రమాదకరం. అన్నం ఎక్కువ సేపు ఉంచితే బాక్టీరియా పెరిగి ఫుడ్ పాయిజన్‌కి కారణం కావచ్చు. ఒకసారి అన్నం వండి వేశాక 24 గంటల్లోపు వాడేయాలి. అంతకంటే ఎక్కువ ఉంచితే ఆహారం పాడవుతుంది. అంతేగాక అది తినడమే ఆరోగ్యానికి ప్రమాదం. అందుకే అవసరమైనంత అన్నం మాత్రమే వండాలి.
ఫ్రిడ్జ్ మన రోజువారీ జీవితంలో ఓ భాగం అయింది. కానీ దాన్ని తెలివిగా వాడాలి. ఏ ఆహారాన్ని అందులో ఉంచాలి..? ఏదిని ఉంచకూడదో స్పష్టంగా తెలుసుకోవాలి. కొన్ని పదార్థాలు ఫ్రిడ్జ్ ఉష్ణోగ్రతతోపాటు బాక్టీరియా వృద్ధికి సహాయపడతాయి. ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. కొంతమంది ఎక్కువ రోజుల పాటు ఫుడ్ స్టోర్ చేసి వాడుతుంటారు. ఈ అలవాటు మంచిది కాదు.
తాజాగా వండిన ఆహారం ఆరోగ్యానికి మంచిది. వాడే పదార్థాలు తాజాగా ఉండాలి. పొట్టుతీసిన వెల్లుల్లి, కోసిన ఉల్లిపాయ, తడిగా ఉన్న అల్లం వంటి పదార్థాలను ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా అవసరం ఉన్నప్పుడు తక్కువ మొత్తంలో తీసుకొని వాడటం ఉత్తమం. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మొదట ఆహార పద్ధతులనే సరిచేసుకోవాలి.