AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. గుడ్లతో వీటిని కలిపి తింటే మీ పని అయిపోయినట్లే..

ఆరోగ్యానికి మేలు చేస్తుందని రోజూ గుడ్లు తింటున్నారా? అయితే మీరు దేనితో కలిపి తింటున్నారనే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎంతటి బలమైన ఆహారమైనా.. తప్పుడు ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే అది శరీరానికి అమృతం బదులు విషంగా మారే ప్రమాదం ఉందని ఆయుర్వేదం, ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ గుడ్లతో కలిపి అస్సలు తినకూడని ఆహారాలేంటో తెలుసుకుందాం..

అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. గుడ్లతో వీటిని కలిపి తింటే మీ పని అయిపోయినట్లే..
Foods You Should Never Eat With Eggs
Krishna S
|

Updated on: Oct 08, 2026 | 8:01 PM

Share

గుడ్లు ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్‌కు అద్భుతమైన మూలం. ప్రతిరోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఉడకబెట్టిన గుడ్డు లేదా ఆమ్లెట్ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు కూడా సూచిస్తుంటారు. అయితే ఎంతటి పోషకాహారమైనా దానిని వేటితో కలిపి తింటున్నామనే విషయంపైనే దాని ఫలితం ఆధారపడి ఉంటుంది. ఆయుర్వేదం, ఆధునిక పోషకాహార నిపుణుల ప్రకారం.. కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి గుడ్లను తీసుకుంటే, అది జీర్ణవ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని కలిగించి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

గుడ్లతో అస్సలు తీసుకోకూడని ఆహార కలయికలు

గుడ్లు – టీ: చాలామందికి గుడ్లు తిన్న వెంటనే నీచు వాసన పోవడానికో లేదా అలవాటు ప్రకారమో వేడివేడి టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ టీలోని టానిన్లు, గుడ్డులోని ప్రోటీన్లతో కలిసి జీర్ణక్రియను మందగింపజేస్తాయి. దీనివల్ల తీవ్రమైన మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి.

గుడ్లు – చక్కెర: గుడ్లను పంచదారతో కలిపి వండడం లేదా బేకింగ్ చేయడం వల్ల రెండింటిలోని అమైనో ఆమ్లాలు రసాయనిక చర్య జరుపుతాయి. ఇది శరీరంలో టాక్సిన్స్‌ను పెంచి, రక్తం గడ్డకట్టే ముప్పును తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గుడ్లు – సోయా పాలు: సోయా పాలు, గుడ్లు రెండూ ప్రోటీన్ సమృద్ధిగా ఉండేవే. అయితే సోయా పాలలో ఉండే కొన్ని ఎంజైమ్ ఇన్హిబిటర్స్ గుడ్డులోని ప్రోటీన్‌ను శరీరం పూర్తిగా గ్రహించకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా పోషకాలు అందకపోగా అజీర్తికి కారణమవుతుంది.

అధిక కొవ్వు గల మాంసం: గుడ్లతో పాటు ఎక్కువ కొవ్వు ఉండే మాంసాన్ని కలిపి తినడం వల్ల శరీరానికి క్షణికమైన శక్తి లభించినట్లు అనిపించినా, వెంటనే అలసట, నీరసం ఆవహిస్తాయి. శరీరం ఈ రెండింటినీ ఒకేసారి జీర్ణం చేసుకోవడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది.

కొన్ని రకాల పండ్లు: గుడ్లు తిన్న వెంటనే పర్సిమోన్ పండు లేదా పుచ్చకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తినకూడదు. ఈ కలయిక వల్ల కడుపుబ్బరం, తీవ్రమైన కడుపునొప్పి, వికారం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.

ఇతర జాగ్రత్తలు

గుడ్లతో పాటు చీజ్, ఎక్కువ మోతాదులో పాల ఉత్పత్తులు, బీన్స్ వంటి అధిక ప్రోటీన్ పదార్థాలను ఒకేసారి భారీగా తీసుకోకపోవడం మంచిది. జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే గుడ్డును తాజా కూరగాయలు లేదా హోల్ వీట్ బ్రెడ్‌తో కలిపి సమతుల్యంగా తీసుకోవడం మంచిది.

(గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. మీ శరీర తత్వాన్ని బట్టి ఏదైనా ఆహార మార్పులు చేసుకునే ముందు వైద్యులు లేదా సర్టిఫైడ్ డైటీషియన్‌ను సంప్రదించడం మంచిది.)

Follow Us
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. గుడ్లతో వీటిని కలిపి తింటే..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. గుడ్లతో వీటిని కలిపి తింటే..
టీ20 ఎఫెక్ట్.. ఏకంగా 12 జట్లతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్..!
టీ20 ఎఫెక్ట్.. ఏకంగా 12 జట్లతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్..!
నానా పటేకర్ మరణంపై అనుచిత వ్యాఖ్యలు.. నటిపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం
నానా పటేకర్ మరణంపై అనుచిత వ్యాఖ్యలు.. నటిపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం
కాపురానికి రాని భార్య.. తీవ్ర మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య..విషాదం
కాపురానికి రాని భార్య.. తీవ్ర మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య..విషాదం
RAC టికెట్ రూల్స్.. ఆ క్షణంలో కూడా టికెట్ పొందే ఛాన్స్
RAC టికెట్ రూల్స్.. ఆ క్షణంలో కూడా టికెట్ పొందే ఛాన్స్
ప్రధాని మోదీని కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీని కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు
బ్యాడ్ లక్కోడికి మరో ఛాన్స్.. బుడ్డోడికి మొండిచేయి..?
బ్యాడ్ లక్కోడికి మరో ఛాన్స్.. బుడ్డోడికి మొండిచేయి..?
ఈ సినిమా నా దగ్గరకు రావడం ఒక అద్భుతం..
ఈ సినిమా నా దగ్గరకు రావడం ఒక అద్భుతం..
సద్భావన ఎక్స్‌ప్రెస్ రైళ్లో షాకింగ్‌ ఘటన..రాత్రి 10 గంటలు దాటగానే
సద్భావన ఎక్స్‌ప్రెస్ రైళ్లో షాకింగ్‌ ఘటన..రాత్రి 10 గంటలు దాటగానే
'ఐ'మూవీలో నటించిన ఈ ట్రాన్స్‌జెండర్ ఇప్పుడెలా మారిపోయారో చూశారా?
'ఐ'మూవీలో నటించిన ఈ ట్రాన్స్‌జెండర్ ఇప్పుడెలా మారిపోయారో చూశారా?