Chocolate Benefits: చాక్లెట్ తినడం వల్ల ఎన్ని లాభాలో తెలిస్తే..ఎగిరి గంతేస్తారు..!

అయితే, మనం తినే సాధారణ చాక్లెట్స్ కంటే కూడా డార్క్ చాక్లెట్స్ చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ డార్క్ చాక్లెట్లలో చక్కెర తక్కువగా ఉంటుంది. డార్క్ చాక్లెట్ తినటం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పలు పరిశోధనలు కూడా వెల్లడించాయి. ఎప్పుడూ ఏదో ఒక చిరుతిండి తినాలని ఉన్న ఒక చిన్న చాక్లెట్‌ నోట్లో వేసుకోండి. ఇక అలాంటి పదార్థాల పైకి మనసు మళ్లదు. తద్వారా అధిక బరువు పెరగకుండా ఉంటారు.

Chocolate Benefits: చాక్లెట్ తినడం వల్ల ఎన్ని లాభాలో తెలిస్తే..ఎగిరి గంతేస్తారు..!
Chocolate Benefits

Updated on: Jun 18, 2025 | 10:23 PM

చాక్లెట్‌ అంటే ఇష్టపడని వారుండరు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ చాక్లెట్‌ తినేందుకు ఇష్టపడతారు. ముఖ్యంగా అమ్మాయిలైతే చెవి కోసుకుంటారు. చాక్లెట్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. ఎన్నో బ్రాండ్స్ చాక్లెట్‌లు మార్కెట్లో అమ్ముతుంటారు. అయితే, చాక్లెట్‌ తినడం వల్ల నోటికి రుచి మాత్రమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. మానసిక ఒత్తిడిని తగ్గించే అద్భుత గుణాలు చాక్లెట్‌లో ఉన్నాయని చెబుతున్నారు. మన మెదడులో సెరటోనిన్‌ హార్మోన్‌ స్థాయులను పెంచి ఆందోళనలను తగ్గిస్తుంది. మనసుకు ప్రశాంతాన్నిస్తుంది.

చాక్లెట్‌లో ‘ఎల్‌-ఆర్జినైన్‌’ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. చాక్లెట్‌లోని ఫ్లేవనాయిడ్స్ అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. అలాగే చర్మానికి రక్తప్రసరణను మెరుగుపరిచి చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. గర్భిణిగా ఉన్నప్పుడు రోజూ 30 గ్రాముల చాక్లెట్‌ తీసుకోవడం వల్ల పిండం ఆరోగ్యంగా ఎదుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే గర్భిణులు చాక్లెట్‌ తినాలని నిపుణులు చెబుతున్నారు.

అయితే, మనం తినే సాధారణ చాక్లెట్స్ కంటే కూడా డార్క్ చాక్లెట్స్ చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ డార్క్ చాక్లెట్లలో చక్కెర తక్కువగా ఉంటుంది. డార్క్ చాక్లెట్ తినటం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పలు పరిశోధనలు కూడా వెల్లడించాయి. ఎప్పుడూ ఏదో ఒక చిరుతిండి తినాలని ఉన్న ఒక చిన్న చాక్లెట్‌ నోట్లో వేసుకోండి. ఇక అలాంటి పదార్థాల పైకి మనసు మళ్లదు. తద్వారా అధిక బరువు పెరగకుండా ఉంటారు.

ఇవి కూడా చదవండి

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..