
చలికాలం వచ్చిందంటే ప్రజలకు నీరసంగా, అలసటగా అనిపించడం సర్వసాధారణం. ఈ కాలంలో రోగనిరోధక శక్తి కూడా బలహీనపడి, జలుబు, ఫ్లూ వంటి సమస్యలు పెరుగుతాయి. అంతేకాకుండా ఈ చలిలో చాలా మంది మోమోస్, చౌమెయిన్ వంటి అనారోగ్యకరమైన ఫాస్ట్ ఫుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఆహారాలు ఆరోగ్యానికి హానికరమని యోగా గురువు బాబా రామ్‌దేవ్ హెచ్చరించారు. నిపుణుల సలహా ప్రకారం.. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే, రోగనిరోధక శక్తిని పెంచే, బలాన్ని ఇచ్చే ఆహారాలను తీసుకోవడం అవసరం. ఈ నేపథ్యంలో బాబా రామ్‌దేవ్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన ఒక సాంప్రదాయ దేశీ వింటర్ స్నాక్ గురించి తెలిపారు.
బాబా రామ్‌దేవ్ తాను ఫాస్ట్ ఫుడ్ అస్సలు తిననని బదులుగా చలికాలంలో చుర్మాను ఇష్టపడతానని తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో వెల్లడించారు. ఈ చుర్మాను ఆయనే స్వయంగా తయారు చేసుకుంటారట. మిల్లెట్ రోటీలో నెయ్యి, చక్కెర వేసి బాగా కలిపి ఈ చలికాలంలో తింటానని ఆయన తెలిపారు. రామ్‌దేవ్ ప్రకారం.. ఈ దేశీ చిరుతిండి శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
మిల్లెట్ బ్రెడ్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఫెలిక్స్ హాస్పిటల్ ఛైర్మన్ డాక్టర్ డి.కె. గుప్తా వివరించారు.
శక్తి, వెచ్చదనం: ఇది చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. తక్షణ శక్తిని అందిస్తుంది.
రక్తంలో చక్కెర నియంత్రణ: రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
పోషకాలు: మిల్లెట్ గ్లూటెన్ రహిత ధాన్యం. ఇది కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు (బి కాంప్లెక్స్), ముఖ్యమైన ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది.
అందుకే చలికాలంలో మోమోస్ వంటి అనారోగ్యకరమైన ఆహారాలకు బదులుగా బాబా రామ్‌దేవ్ సూచించిన ఈ దేశీ పోషక విలువలు ఉన్న చిరుతిండిని ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.