డైటింగ్, యోగా, వ్యాయామం బరువు తగ్గేందుకు కోసం అంతా ఫాలో చేస్తుంటారు. వీటితోపాటు ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చడం ద్వారా కూడా మీరు ఈజీగా బరువు(Weight Loss) తగ్గేందుకు అవకాశం ఉంది. ఇందుకోసం తప్పనిసరిగా కొన్ని మసాలా దినుసులను మీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. మసాలా దినుసులు మీ ఆహారం(Food) రుచిని పెంచడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. డైటింగ్(Diet) సమయంలో చాలా మంది రుచిగా లేని ఆహారాన్ని తింటుంటారు. సుగంధ ద్రవ్యాలు మిమ్మల్ని బరువు కచ్చితంగా తగ్గిస్తాయి. ఈ హెల్తీ హెర్బ్స్, మసాలా దినుసులను ఉపయోగిస్తే, క్రమంగా మీ బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1- జీలకర్ర- జీలకర్రను మన ఇళ్లలో వాడుతూనే ఉంటాం. అయితే బరువు తగ్గడంలో ఇది ఎంతో చక్కగా సహాయపడుతుంది. జీలకర్ర ఇన్సులిన్ సెన్సిటివిటీని మారుస్తుంది. ఇందులో ఫైటోస్టెరాల్స్ ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి జీలకర్ర నీటిని కూడా తాగవచ్చు. ఇది కాకుండా, జీలకర్రను మజ్జిగలో లేదా పెరుగులో కలిపి తింటే కడుపునకు మేలు చేస్తుంది.
2- దాల్చినచెక్క- శరీరం చక్కెరను ప్రాసెస్ చేయడంలో దాల్చినచెక్క కీలక పాత్ర పోషిస్తుంది. దాల్చిన చెక్క చక్కెరను కొవ్వుగా మార్చడాన్ని నిరోధిస్తుంది. దీని కారణంగా ఆహారం నెమ్మదిగా ప్రేగులలోకి చేరుతుంది. దాల్చిన చెక్క వల్ల బెల్లీ ఫ్యాట్ బాగా తగ్గుతుంది.
3- నల్ల మిరియాలు- నల్ల మిరియాలు కొవ్వు కణాల ఏర్పాటు ప్రక్రియను ఆపడంలో సహాయపడతాయి. ఎండుమిర్చి తినడం వల్ల కొవ్వుకు సంబంధించిన సమస్యలు రావు. మీరు జలుబు చేసినప్పుడు బ్లాక్ పెప్పర్ టీ తాగవచ్చు. అంతే కాకుండా, ఆమ్లెట్లు, సలాడ్లు, సూప్‌లలో రుచిని పెంచడానికి నల్ల మిరియాలు కూడా వాడుకోవచ్చు.
4- యాలకులు- యాలకులు జీర్ణక్రియలో చాలా సహాయకారిగా పనిచేస్తాయి. యాలకులు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది జీవక్రియ చర్యను పెంచుతుంది. ఇవి ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. అలాగే యాలకులతో టీ చేసుకుని కూడా తాగొచ్చు.
5- పసుపు- కూరగాయలో పసుపు లేకుంటే చాలా కష్టం. పసుపులో పూర్తిగా ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. పసుపు తినడం వల్ల శరీరంలో మంటలు తొలగిపోతాయి. పసుపు అనేక రకాల టాక్సిన్స్ నుంచి మనల్ని కాపాడుతుంది. అలాగే పసుపు జీవక్రియను సాఫీగా చేస్తుంది. ఇది బరువు తగ్గడాన్ని సులభం చేస్తుంది. చలికాలంలో పసుపు పాలు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
Also Read: Onion Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు ఉల్లిపాయలు అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసుకోండి!
Mysore Bonda: మైసూర్ బోండా తింటున్నారా.. అయితే ఈ వ్యాధులు ఉన్నవారు అస్సలు తినకూడదు..