Health Tips: రాగి పాత్రలో నీళ్లు ఎక్కువసేపు ఉంచుతున్నారా.. అయితే, ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..

|

Jul 02, 2022 | 11:05 AM

కాపర్ శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని కారణంగా జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. కానీ, మన శరీరం రాగిని స్వయంగా తయారు చేసుకోదు. కాబట్టి

Health Tips: రాగి పాత్రలో నీళ్లు ఎక్కువసేపు ఉంచుతున్నారా.. అయితే, ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..
Copper Water Benefits
Follow us on

రాగి పాత్రలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. పెద్దలు కూడా ఎన్నోసార్లు ఇదే విషయాలను చెబుతుంటారు. దీనిని చాలామంది పాటిస్తూనే ఉంటారు. అయితే, సక్రమంగా ఉపయోగించకపోతే మాత్రం మన ఆరోగ్యంపాలిట విషంగా మారుతుందని నిపుణులు సూచిస్తున్నారు. రాగిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి హానికరంగా మారుతుందంట. అలాగే రాగి పాత్రలో పులుపు లాంటివి అస్సలు తినకూడదంట.

రాగి పాత్రలో నీటిని 10 నుంచి 12 గంటల కంటే ఎక్కువ ఉంచితే ప్రమాదం..

రాగి శరీరానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. ఇది కాకుండా, ఎవరైనా కాలేయ సంబంధిత సమస్య కలిగి ఉంటే, వారు రాగి పాత్రలో నీటిని తీసుకంటే మంచిది. సాధారణ వ్యక్తికి 0.90 మి.గ్రా రాగి అవసరం. ఎవరైనా 3 గ్రాముల కంటే ఎక్కువ రాగిని తీసుకుంటే, వారికి గుండె జబ్బులు వస్తాయి. ఇది కాకుండా, ఎవరైనా పేగు మంట సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. శరీరంలో కాపర్ అధికంగా ఉండటం వల్ల కాలేయం పాడయ్యే అవకాశం కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

పులుపును రాగి పాత్రలో ఉంచితే విషమే..

రాగి పాత్రలో రసం, ఊరగాయ, పెరుగు లేదా మజ్జిగ వంటి పుల్లనివి తినడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. పుల్లని వస్తువులు రాగి పాత్రలో ఉంచితే ప్రతిచర్యల కారణంగా, ఆ పదార్థాలు విషంగా మారతాయి. రాగి పాత్రలలో పుల్లని పదార్థాలను ఉంచి, అస్సలు తినకూడదు. లేదంటే ఆరోగ్యం పాడవుతుంది. అంతే కాకుండా ఆహార పదార్థాలను రాగి పాత్రలో ఎక్కువ సేపు ఉంచడం వల్ల వాటి రుచి పాడైపోతుంది.

ఎంత కాపర్ తీసుకుంటే మంచిది..

1 నుంచి 3 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు రోజుకు 0.34 mg రాగిని తీసుకోవచ్చు. అదే సమయంలో, 19 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఆహారం, ఇతర వస్తువుల నుంచి 0.90 mg రాగిని తీసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు 1 mg, తల్లిపాలు ఇచ్చే స్త్రీలు 1.3 mg రాగిని ఒక రోజులో తీసుకోవచ్చు.

రాగి శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని కారణంగా జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. కానీ, మన శరీరం రాగిని స్వయంగా తయారు చేసుకోదు. కాబట్టి పుట్టగొడుగులు, జీడిపప్పు, నువ్వులు, బాదం, పప్పులు, చియా గింజలు, అవకాడోలు, ఎండుద్రాక్ష వంటి అనేక వస్తువులు శరీరానికి రాగిని సరఫరా చేస్తాయి.

రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

రాగిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల, అందులో ఉంచిన నీటిని తాగడం వల్ల శరీరంలో వాపు, నొప్పి, తిమ్మిర్లు రావు. రాగి పాత్రలో ఉంచిన నీరు ఆర్థరైటిస్ సమస్యను ఎదుర్కోవడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది.

రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగడం వల్ల కడుపు లేదా జీర్ణ సంబంధిత సమస్యలకు ఆరోగ్యకరమైన ఎంపిక. గ్యాస్, మలబద్ధకం, కడుపునొప్పి, అసిడిటీ వంటి సమస్యలు ఉన్నవారు రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగాలి. ఇది కాకుండా, ఇది చర్మ వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది. ఇది జీవక్రియను కూడా పెంచుతుంది.