Watch: వామ్మో.. చిక్కీలు ఇలా తయారు చేస్తారా? ప్రమాదకర రసాయనాలతో తయారీ.. వీడియో వైరల్

వేరుశనగ పప్పుతో తయారు చేసే చిక్కీలు ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇవి రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారు చిక్కీలు తింటే రక్తం పుష్టిగా పడుతుంది. శీతాకాలంలో వీటిని తినడం వల్ల చలి నుంచి ఉపశమనం కలగుతుంది. అయితే మార్కెట్లో దొరికే చిక్కీలు..

Watch: వామ్మో.. చిక్కీలు ఇలా తయారు చేస్తారా? ప్రమాదకర రసాయనాలతో తయారీ.. వీడియో వైరల్
Street Vendor Chikki Making Video

Updated on: Dec 23, 2025 | 7:49 PM

వేరుశనగ పప్పుతో తయారు చేసే చిక్కీలు ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇవి రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారు చిక్కీలు తింటే రక్తం పుష్టిగా పడుతుంది. శీతాకాలంలో వీటిని తినడం వల్ల చలి నుంచి ఉపశమనం కలగుతుంది. అయితే మార్కెట్లో దొరికే చిక్కీలు ఎలా తయారు చేస్తారో ఎప్పుడైనా చూశారా? ప్రస్తుతం ఓ వీథి వ్యాపారి చిక్కీ తయారీ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఈ ప్రసిద్ధ శీతాకాలపు స్వీట్‌ను సాంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తారని అందరూ అనుకుంటారు. కానీ వాస్తవం వేరే ఉంటుంది. ఫుడ్ వ్లాగర్ అర్జున్ చౌహాన్ షేర్ చేసిన ఈ ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో 2 మిలియన్ల వీక్షణలతో వైరల్‌ అవుతుంది. ఒక వీధి వ్యాపారి.. ఓ పెద్ద ఇనుప పాత్రను వేడి చేసి అందులో చక్కెరతో పంచదార పాకం చేయడంతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. గింజల మిశ్రమాన్ని కలపడానికి ముందు అందులో నెయ్యి వేస్తారు. ఆ తరువాత ఆహార రంగును కొద్దిగా నీళ్లలో కలిపి అందులో వేయడం వీడియోలో చూడొచ్చు.

ఇలా చిక్కగా తయారు చేసిన సిరప్‌లో జీడిపప్పు, బాదం, గుమ్మడికాయ గింజలు వేసి కలుపుతాడు. ఆ తర్వాత ఈ వేడి మిశ్రమాన్ని గ్రీజు చేసిన ఓ ప్లైట్‌పై పోసి రోలింగ్ పిన్‌ని ఉపయోగించి చదును చేస్తాడు. అది వెచ్చగా ఉన్నప్పుడే షీట్‌ను సమాంతరంగా, నిలువుగా సమాన పరిమాణంలో ముక్కలుగా కట్‌ చేస్తాడు. అవి చల్లబరిచిన తర్వాత ప్యాక్‌ చేస్తారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు వీథి వ్యాపారి చిక్కీ తయారు చేసిన విధానంపై మండిపడుతున్నారు. సాధారణంగా చిక్కీలను ముడి బెల్లంతో తయారు చేస్తారు. దీనికి బదులుగా చక్కెర వినియోగించి, ఆపై అనుమానం రాకుండా బెల్లం రంగులో ఉన్న కృత్రిమ రంగులను వాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో చిక్కీ తయారీలో బెల్లం ఎక్కడ? అని ఒకరు, ఇది మనం శీతాకాలంలో తినే చక్కెర చిక్కీ కాదు అని ఇంకొకరు, ఛీ.. చిక్కీని ఇలా తయారు చేయరు అని మరొకరు కామెంట్‌ సెక్షన్‌లో చిక్కీ తయారు చేసిన విధానాన్ని ప్రశ్నించారు. పైగా అతగాడు చిక్కీ తయారు చేసేందుకు వాడిన పదార్థాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో సులువుగా తయారు చేసే చిక్కీకి ప్రమాదకరమైన రంగు, జెలటిన్ ఎందుకు వినియోగించారు అంటూ మండి పడుతున్నారు. జెలటిన్, రంగు రెండూ హానికరం. సాంప్రదాయ ఆహారానికి వీటి అవసరం లేదు అని మరికొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో వీధి ఆహార వంటకాలపై మరో మారు చర్చకు దారి తీసింది. అయితే కొందరు వ్యాపారులు ఈ చిక్కీ వీడియోను సమర్థించగా, ఎక్కువ మంది వ్యతిరేకించారు. మీ లాభాల కోసం జనాల ప్రాణాలతో ఆటలాడుతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత కూడా వీథుల్లో దొరికే తిరుతిళ్లు కొని తింటే అది మీ ఖర్మే..!

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.