Curd: ఈ వ్యాధులు ఉన్నవారు పెరుగు అస్సలు తినకూడదట.. తింటే సమస్యలు తప్పవు..

|

Aug 16, 2021 | 10:49 AM

శరీరానికి మేలు చేసే పదార్థాలలో పెరుగు స్థానం ప్రత్యేకం. పెరుగు తినడం వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి.

Curd: ఈ వ్యాధులు ఉన్నవారు పెరుగు అస్సలు తినకూడదట.. తింటే సమస్యలు తప్పవు..
Curd
Follow us on

శరీరానికి మేలు చేసే పదార్థాలలో పెరుగు స్థానం ప్రత్యేకం. పెరుగు తినడం వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అలాగే ఎముకలకు మేలు చేస్తుంది. పెరుగును క్రమం తప్పకుండా తీసుకుంటే అది కొలెస్ట్రాల్ మరియు అధిక బీపీ సమస్యను తగ్గిస్తుంది. పెరుగుతో ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా, చర్మానికి, జుట్టుకు కూడా మేలు చేస్తుంది.  కానీ కొంతమందికి పెరుగు తీసుకోవడం చాలా హానికరం. ఈ వ్యాధులు ఉన్నవారు పెరుగు తీసుకోవడం మానుకోవాలి. అలాగే పెరుగును ప్రతిరోజూ అవసరానికి మించి తీసుకుంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఎలాంటి వ్యాధులు ఉన్నవారు పెరుగు తినకూడదో తెలుసా..

1. పెరుగు తీసుకోవడం వలన ఎముకలు, దంతాలకు మంచిది. అయితే పెరుగు తినడం వలన కీళ్లనొప్పులు ఉన్న రోగులకు హానికరం. అర్థరైటిస్ రోగులు పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం మానుకోవాలి. ఇది నొప్పిని మరింత తీవ్రం చేస్తుంది.
2. శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడేవారు పెరుగు తీసుకోవద్దు. అలాగే ఆస్తమా రోగులు కూడా పెరుగు తీసుకోవడం మానుకోవాలి. పెరుగు తినాల్సి వస్తే కేవలం పగటి పూట మాత్రమే పెరుగు తీసుకోవాలి. రాత్రిపూట అస్సలు తీసుకోవద్దు.
3. లాక్టోస్ అసహనం ఎక్కువగా ఉన్నవారు.. పెరుగు తీసుకోవద్దు. అలాంటి వారికి పెరుగు తినడం వలన డయేరియా మరియు కడపులో నొప్పి సమస్య ఉండదు.
4. అసిడిటీ సమస్య ఎక్కువగా ఉన్నవారు పెరుగును అస్సలు తినకూడదు. ముఖ్యంగా వీరు రాత్రి పూట పెరుగు అస్సలు తినవద్దు.

Also Read: Guava Leaves Benefits: జామ ఆకులతో ఎన్నో ప్రయోజనాలు.. ఇలా వాడితే జుట్టు సమస్యలకు చెక్ పెట్టినట్లే..

Jaggery Side Effects: బెల్లం ఎక్కువగా తింటున్నారా ? అయితే జాగ్రత్తగా.. శ్రుతిమించే ఈ ప్రమాదాలు..

Over Thinking: ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూస్తున్నారా? ఇటువంటి సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే..

Curd Weight Loss: పెరుగును ఇలా తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు.. తెలిస్తే తినకుండా ఉండలేరు!