Health Tips: ఈ 5 పదార్థాలు అతిగా తింటున్నారా.. అయితే, మీ కిడ్నీలు డేంజర్ జోన్‌లో పడ్డట్లే.. మానేస్తేనే బెటర్..

|

Aug 10, 2022 | 7:55 AM

Kidney Health Tips: మధుమేహం కూడా మూత్రపిండాల వ్యాధికి దారి తీస్తుంది. ఇతర సాధారణ ప్రమాద కారకాలు వయస్సు, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, మద్యపానం, హెపటైటిస్ లాంటివి కూడా మూత్రపిండాలను పాడు చేస్తాయి.

Health Tips: ఈ 5 పదార్థాలు అతిగా తింటున్నారా.. అయితే, మీ కిడ్నీలు డేంజర్ జోన్‌లో పడ్డట్లే.. మానేస్తేనే బెటర్..
Food
Follow us on

Kidney Health Tips: మన శారీరక విధుల్లో కిడ్నీ పాత్ర, ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్థితిలో మూత్రపిండాల ఆరోగ్యం గురించి తప్పక ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆలోచించకపోతే మాత్రం, ఇకనైనా ఈ విషయాలపై ఫోకస్ చేయాలి. లేదంటే ఆహారం, రొటీన్ కిడ్నీ సమస్యలు, వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. మీకు మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నట్లయితే దానితో కిడ్నీ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. మూత్రపిండాలు మానవ శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. శరీరం నుంచి వ్యర్థాలు, అదనపు ద్రవాన్ని తొలగించడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. రక్తంలో మంచి ఆరోగ్యానికి అవసరమైన నీరు, లవణాలు, ఖనిజాల ఆరోగ్యకరమైన సమతుల్యతను నిర్వహించడానికి కూడా ఇవి సహాయపడతాయి. అయినప్పటికీ, అనారోగ్యకరమైన ఆహార ఎంపికలతో కూడిన సరికాని జీవనశైలి మీ మూత్రపిండాల ఆరోగ్యం, పనితీరును దెబ్బతీస్తుంది.

మయోన్నైస్..

సలాడ్‌లు లేదా శాండ్‌విచ్‌ల కోసం ఉపయోగించే మయోన్నైస్ మీ ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఇలాంటి శాకాహార ఫుడ్ విలువను కూడా ఇది మయోన్నైస్ పాడు చేస్తుంది. కేవలం ఒక టేబుల్ స్పూన్ మయోనైస్‌లో 103 కేలరీలు ఉంటాయి. అదనంగా ఇందులో సంతృప్త కొవ్వుః ఎక్కువగా ఉంటుంది. ఇందుకోసం కొవ్వు రహిత లేదా తక్కువ కేలరీల మయోన్నైస్‌ను ఎంచుకుంటే బెటర్. అయితే వీటిలో సోడియం, చక్కెర ఎక్కువగా లేవని నిర్ధారించుకోండి. మయోన్నైస్‌ను సూపర్ హెల్తీ గ్రీక్ పెరుగు లేదా హేంగ్ పెరుగుతో భర్తీ చేయడం ఉత్తమ ఎంపిక.

ఇవి కూడా చదవండి

ప్రాసెస్ చేసిన ఆహారాలు..

మైక్రోవేవ్‌లో వండిన ఆహారాలు లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలు టైప్ 2 డయాబెటిస్ అభివృద్ధికి దోహదం చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రాసెసింగ్ అంటే ఆహారం కొవ్వు, చక్కెర లేదా సోడియంతో నిండి ఉండవచ్చు. ఇలాంటి ఆహారాలను తినేముందు వేడి చేయడం మంచిది.

సోడా..

సోడాలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. పోషక విలువలు లేవు. ఇవి మీ ఆహారంలో అదనపు కేలరీలను జోడిస్తాయి. దీని ఫలితంగా బరువు పెరుగుతారు. సోడా వినియోగంతో ఎముకల బోలుగా మారతాయి. ఇది మూత్రపిండాల వ్యాధి, జీవక్రియ సిండ్రోమ్, దంత సమస్యలను పెంచుతాయి.

ప్రాసెస్ చేసిన మాంసం..

బేకన్, సాసేజ్, హాట్ డాగ్‌లు, బర్గర్ ప్యాటీస్ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలు మీ కిడ్నీ ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతాయి. ఇవి అధిక సోడియం కలిగిన ఆహారాలు. క్రమం తప్పకుండా అదనపు సోడియం తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది మీ మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. జంతు ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ వ్యాధి పురోగతి రేటు పెరుగుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.

డీ ఫ్రై చేసిన బంగాళదుపంలు..

మీరు ఫాస్ట్ ఫుడ్ చైన్‌ల నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ లేదా బంగాళదుంపల రూపంలో చిప్స్ వంటి ప్యాక్ చేసిన ఆహారాన్ని తీసుకుంటే, మీ విలువైన కిడ్నీ ప్రమాదంలో పడినట్లే. గుండె, కిడ్నీ వ్యాధుల నుంచి రక్షించడానికి డీప్ ఫ్రైడ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. బంగాళాదుంపలలో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు ఇప్పటికే మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతుంటే తగ్గించాలని సిఫార్సు చేస్తున్నారు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసమే. ఇవి ఏదైనా ఔషధం లేదా చికిత్సకు ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా టిప్స్, సూచనలు పాటించే ముందు తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.