రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ డ్రింక్స్ సరైనవే.. రోజూ ఉదయం తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరిగినట్లే..

|

May 13, 2021 | 2:21 PM

ప్రస్తుతం యావత్ భారతం ఎదుర్కోంటున్న అతి పెద్ద సమస్య కరోనా వైరస్. ఈ మహమ్మారి ప్రభావంతో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు పొగోట్టుకోగా..

రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ డ్రింక్స్ సరైనవే.. రోజూ ఉదయం తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరిగినట్లే..
Immunity Booster
Follow us on

ప్రస్తుతం యావత్ భారతం ఎదుర్కోంటున్న అతి పెద్ద సమస్య కరోనా వైరస్. ఈ మహమ్మారి ప్రభావంతో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు పొగోట్టుకోగా.. లక్షల మంది ఆసుపత్రులలో ప్రాణాల కోసం పోరాడుతున్నారు. అయితే కరోనా వైరస్ వలన మన జీవన విధానంలో అనేక మార్పులు జరిగాయి. ఎక్కువ మంది తమ ఆహారపు అలవాట్లను మార్చుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అందరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవడం సహజ వనరులు, ఇంట్లో వండిన వంటలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. కేవలం ఆహారపు అలవాట్లు మాత్రమే కాకుండా.. రోజూ ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగడం వలన రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

పసుపు- నిమ్మరసం..

కావల్సినవి..
నీరు 2 లీటర్లు.
పసుపు 2 ఇంచులు
మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్
పుదీనా 15-20 ఆకులు
దాల్చిన చెక్క 2 ఇంచులు
లవంగాలు 8-10
నిమ్మరసం ఒకటి

తయారీ విధానం..
ఒక గిన్నేలో నీరు మీడియం మీద వేడి చేయాలి. ఆ తర్వాత పైన చెప్పిన పదార్థాలన్నింటిని అందులోవేసి 15-20 నిమిషాలు వేడిచేయాలి. తర్వాత దీనిని ఫిల్టర్ చేసి చల్లారక తాగాలి.

ఇందులోని పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. కర్కుమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అలాగే మిరియాలు బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పుదీనా రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

పసుపు-అల్లం..

కావల్సినవి..
నీరు కప్పు
అల్లం కొద్దిగా
పసుపు
ఆపిల్ సైడర్ వెనిగర్ టేబుల్ స్పూన్.
తేనె టేబుల్ స్పూన్

తయారీ విధానం..
ఒక గిన్నెలో నీరు, అల్లం , పసుపు వేసి 5-10 నిమిషాలు మరిగించాలి. చల్లారిన తర్వాత దానిని ఒక కప్పులో వడకట్టి తేనె, కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి తాగాలి.

ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ శరీరంలో వ్యాధికారక పెరుగుదలను నిరోధిస్తుంది అలాగే ఆరోగ్యకరమైన పేగు బాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీనికి బలమైన రోగనిరోధక శక్తి అవసరం. పసుపు, అల్లం యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటాయి. పసుపు ఒక సహజ వైద్యం పదార్థం. అల్లం, మరోవైపు, తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. ఇది వ్యాధికారక కణాలను నాశనం చేయడానికి సహాయపడుతుంది.

Also Read: ఉసిరితో లాభాలెన్నో.. రోగ నిరోధక శక్తిని పెంచే దివ్య ఔషదం.. మందుల కంటే ఆమ్లా చేసే మేలు ఎంతో..