Health Tips: పెరుగు అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. పెరుగు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రతి రోజు ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి ఎంతో మంచిది. వేసవి కాలంలో అయితే శరీరాన్ని చల్లబర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. వైద్య నిపుణుల సలహాల ప్రకారం.. పెరుగులో అనేక పోషకాలున్నాయి. అయితే పెరుగులో ఈ మూడు ఆహారాలు కలుపుకొన తింటే తక్షణ శక్తి వస్తుంది. అవేంటో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1. పెరుగు, డ్రై ఫ్రూట్స్
పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి తినడం వల్ల శరీరంలోని బలహీనత తొలగిపోతుంది. మీరు సన్నగా ఉంటే ప్రతి రోజు తీసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరోవైపు మీరు పాలు తాగకపోతే ఇది శరీర ఆరోగ్యానికి మంచి మందుగా పనిచేస్తుంది.
2. పెరుగు, బెల్లం
కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి మీ డైట్‌లో వివిధ రకాల ఆహారాలను చేర్చవచ్చు. ఇందులో పెరుగు, బెల్లం వినియోగం కూడా ఉంటుంది. ఇది రుచికరమైనది మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. దీని రెగ్యులర్ వినియోగం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. హిమోగ్లోబిన్ పెరుగుతుంది, రక్త శుద్దీకరణగా కూడా పనిచేస్తుంది.
3. పెరుగు, జీలకర్ర
మీకు ఆకలి అనిపించకపోయినా, అజీర్ణం వంటి సమస్యలున్నా, పెరుగును నల్ల ఉప్పు, కాల్చిన జీలకర్రతో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఆకలి పెరుగుతుంది. దీంతో పాటు జీర్ణ ప్రక్రియ కూడా బాగుంటుంది. అలాగే బరువు కూడా తగ్గుతుంది.
తిమ్మిరి నుంచి ఉపశమనం..
4. తిమ్మిరి నుంచి ఉపశమనం
పెరుగు బెల్లం మహిళలకు తిమ్మిరి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందువల్ల మీరు రుతుస్రావం సమయంలో దీనిని తినవచ్చు. బరువు తగ్గడానికి కూడా బెల్లంను మీ డైట్లో చేర్చుకోవచ్చు. ప్రతిరోజు ఒక కప్పు పెరుగు, బెల్లం తింటే ఆరోగ్యంగా ఉంటారు.