Teeth Care Tips: మీ ఆకులను నమిలితే మీ పళ్లు మిలమిలమని మెరుస్తాయ్!

| Edited By: Ravi Kiran

Nov 11, 2023 | 9:59 PM

కొంత మందికి పళ్లు పసుపు పచ్చగా ఉంటాయి. మరి కొంత మందికి నల్లగా, గోధుమ రంగు కలర్ ఇలా ఉంటాయి. ఇలా పళ్లను బట్టి కూడా మన ఆరోగ్యాన్ని చెప్పవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా పళ్ల సమస్యలతో బాధ పడేవారు నలుగురిలోకి రావాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సరిగ్గా.. నవ్వలేరు.. మాట్లాడలేరు. సరిగ్గా బ్రెష్ చేసుకోవ పోవడం, కాఫీ, టీలు ఎక్కువగా తాగడం, వయస్సు పెరగడం కారణంగా పళ్ల రంగు మారుతూ ఉంటాయి. అయితే వీటిని నిర్లక్ష్యం చేస్తే..

Teeth Care Tips: మీ ఆకులను నమిలితే మీ పళ్లు మిలమిలమని మెరుస్తాయ్!
Teeth Care
Follow us on

కొంత మందికి పళ్లు పసుపు పచ్చగా ఉంటాయి. మరి కొంత మందికి నల్లగా, గోధుమ రంగు కలర్ ఇలా ఉంటాయి. ఇలా పళ్లను బట్టి కూడా మన ఆరోగ్యాన్ని చెప్పవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా పళ్ల సమస్యలతో బాధ పడేవారు నలుగురిలోకి రావాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సరిగ్గా.. నవ్వలేరు.. మాట్లాడలేరు. సరిగ్గా బ్రెష్ చేసుకోవ పోవడం, కాఫీ, టీలు ఎక్కువగా తాగడం, వయస్సు పెరగడం కారణంగా పళ్ల రంగు మారుతూ ఉంటాయి. అయితే వీటిని నిర్లక్ష్యం చేస్తే.. దంతాల నుంచి రక్త స్రావం, నోటి దుర్వాసన, పళ్లు బలహీన పడటం వంటివి జరుగుతాయి. పళ్లను ఆరోగ్యంగా, తెల్లగా మిలమిలమని మెరిపించాలంటే మన ఇంట్లో ఉండే కొన్ని రకాల మొక్కల ఆకులు నమిలితే సరిపోతుంది. మరి ఆ ఆకులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వేపాకు:

పసుపు రంగులోకి మారిన పళ్లను మళ్లీ తెల్లగా మార్చడంలో వేపాకు బాగా ఉపయోగ పడుతుంది. వేప ఆకుల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి పళ్లపై ఉండే బ్యాక్టీరియాను తరిమి కొట్టి.. పళ్లను తెల్లగా మార్చుతాయి. వేప ఆకులతో తయారు చేసిన టూత్ పేస్ట్ వాడినా మంచి ఫలితం కనిపిస్తుంది. అంతే కాకుండా నోటి దుర్వాసనను కూడా పోగొడతాయి. పళ్లు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

తులసి ఆకులు:

తులసి ఆకుల్లో కూడా గొప్ప ఔషధ లక్షణాలు ఉన్నాయి. అందుకు ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉండాలని చెబుతారు. తులసిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. తులసి ఆకుల రసాన్ని మౌత్ వాష్ గా వాడినా, ఆకులు నమిలినా పళ్ల పై పేరుకుపోయిన ఫలకం, బ్యాక్టీరియా తొలగి.. తెల్లగా మారతాయి. అంతే కాకుండా నోటి దుర్వాసన కూడా రాదు. పళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

తమల పాకు:

తమల పాకు మొక్క కూడా మన చుట్టు పక్కలే ఉంటుంది. తమల పాకులో మంచి ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే దీన్ని తాంబూలంగా వాడతారు. తమల పాకులో యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. తమల పాకును నమిలినా.. ఈ ఆకు రసాన్ని మౌత్ వాష్ గా ఉపయోగించడం వల్ల పసుపు పచ్చగా ఉన్న పళ్ల రంగు.. తెల్లగా మారుతుంది. అంతే కాకుండా నోటిలోని బ్యాక్టీరియాను కూడా తరిమి కొడుతుంది. నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుంది.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.