Sugarcane Juice: మండుతున్న ఈ వేసవి ఎండల నేపథ్యంలో డీహైడ్రేషన్, వడదెబ్బ, అలసట వంటి సమస్యలు మనల్ని వెంటాడుతుంటాయి. సహాజంగా వేసవిలో దాహం వేస్తే.. చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతారు. అయితే వీటికంటే సహజంగా లభించే పుదీనా వాటర్, కొబ్బరినీరు, చెరుకు రసం వేసవి దాహార్తిని తీర్చడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ క్రమంలోనే ఎక్కువగా నీళ్లు, లేదా కొబ్బరి నీళ్లు, చెరకు రసం వంటివి తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఇక చెరకు రసం గురించి చెప్పుకోవాలంటే ఇది ఎన్నో రకాల పోషక గుణాలను కలిగి ఉండడం వల్ల మనకు మంచిది. ఇందులోని ఫైబర్ మన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇంకా ఇందులోని విటమిన్ సీ మన రోగనిరోధక శక్తిని పటిష్టపరిచి, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. ఇంకా ఈ చెరకు రసంతో ఏయే ప్రయోజనాలున్నాయో ఇప్పుడు చూద్దాం..
దృఢమైన ఎముకలు: చెరకులో ఎక్కువశాతం కాల్షియం ఉండటంతో అది ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చిన్న పిల్లల ఎదుగుదలకు చెరకు రసం చక్కగా దోహదపడుతుంది. అంతేకాదు, వెన్నెముక బలంగా ఉండటానికి కూడా చెరకు ఉపయోగపడుతుంది.
తక్షణ శక్తి: నీరసంగా ఉన్న సమయంలో గ్లాసు చెరకురసం తాగితే తక్షణ శక్తి వస్తుంది. ఇందులో ఉండే సూక్రోజు కారణంగా వెంటనే అలసట దూరమవుతుంది.
వ్యాధినిరోధక శక్తి: పిల్లల్లోవ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.. వారిలో తరచూ వచ్చే చిన్నచిన్న అనారోగ్యాల నుంచి ఉపశమనం అందిస్తుంది. తీవ్ర జ్వరం, మాంసకృత్తులు లోపించడం వంటి సమస్యల నుంచి పిల్లలను ఈ రసం కాపాడుతుంది.
కాలేయ పని తీరు: గ్లాసు చెరకురసానికి అరచెక్క నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. రోజుకు ఇలా రెండు సార్లు తాగితే, కాలేయ పని తీరు మెరుగుపడుతుంది.
మెరుగైన జీర్ణవ్యవస్థ: అజీర్తిని పోగొట్టి, జీర్ణశక్తిని పెంచడంలోనూ చెరకురసం అద్భుతంగా పనిచేస్తుంది. జీర్ణాశయంలో పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేసే పొటాషియం ఇందులో రసం తరచుగా తాగేవారికి అజీర్ణ సమస్య దూరంగా ఉంటుంది.
బరువుకు చెక్: శరీరంలో బరువు పెరగడానికి కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ను ఈ రసం తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికీ చెరకురసం దివ్యౌషధంలా పనిచేస్తుంది. అలాగే ఈ రసం శరీరంలోని వ్యర్థాలను కూడా తొలగించగలదు.
రొమ్ము కాన్సర్: రొమ్ము కాన్సర్ బారినపడకుండా కాపాడే ఔషధగుణాలు కూడా ఈ రసంలో ఉన్నాయి. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్లు క్యాన్సర్ కణాలు అడ్డుకుంటాయని పరిశోధనల్లో తేలాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..