SriRama Navami Special: శ్రీరామ నవమి రోజున పానకం వడపప్పుకి అత్యంత ప్రాధ్యాన్యత.. వీటి రెసిపీ ఏమిటంటే..!

|

Apr 14, 2021 | 9:01 AM

SriRama Navami Special: తెలుగువారి కొత్త సంవత్సర ప్రారంభ పండగ ఉగాదిని ఘనంగా జరుపుకున్నాం.. ఇప్పుడు హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడి కళ్యాణం కోసం రెడీ అవుతారు. దేశ వ్యాప్తంగా శ్రీ రామనవమికి..

SriRama Navami Special: శ్రీరామ నవమి రోజున పానకం వడపప్పుకి అత్యంత ప్రాధ్యాన్యత.. వీటి రెసిపీ ఏమిటంటే..!
Panakam Vadapappu
Follow us on

SriRama Navami Special: తెలుగువారి కొత్త సంవత్సర ప్రారంభ పండగ ఉగాదిని ఘనంగా జరుపుకున్నాం.. ఇప్పుడు హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడి కళ్యాణం కోసం రెడీ అవుతారు. దేశ వ్యాప్తంగా శ్రీ రామనవమికి ఆలయాల్లో, వీధుల్లో సందడి మొదలైంది. శ్రీరామ నవమి రోజున పానకం వడపప్పుకి అత్యంత ప్రాధ్యాన్యత ఉంది. నవమి రోజున పానకం, వడపప్పుని ప్రసాదంగా వితరణ చేస్తారు. అయితే దీనివెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉంది.. వేసవి లో వడపప్పు, పానకాన్ని ప్రసాద రూపంలో తీసుకోవడంతో ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. ఈరోజు నవమి స్పెషల్ గా పానకం, వడపప్పు తయారీ తెలుసుకుందాం..!

పానకం తయారీకి కావలసిన పదార్థాలు :

బెల్లం – 3 కప్పులు
మిరియాల పొడి – 3 టీ స్పూన్లు,
ఉప్పు : చిటికెడు,
శొంఠిపొడి : టీ స్పూన్,
యాలకుల పొడి : టీ స్పూన్
నీరు : 9 కప్పులు

తయారీ విధానం :

ముందుగా బెల్లాన్ని మెత్తగా దంచుకుని తర్వాత నీళ్ళలో కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగాక.. పలుచని క్లాత్‌లో వడకట్టాలి. ఇందులో మిరియాలపొడి, శొంఠి పొడి, ఉప్పు, యాలకల పొడి వేసి బాగా కలపాలి. అంతే రాముడికి నైవేద్యం పెట్టడానికి పానకం రెడీ అయ్యినట్లే..

వడపప్పు తయారీకి కావలసిన పదార్థాలు:

పెసరపప్పు – కప్పు,
పచ్చిమిర్చి – 1 (చిన్నముక్కలు)
కొత్తిమీర తరుగు- టీ స్పూన్,
కొబ్బరి తురుము -టేబుల్ స్పూన్,
ఉప్పు – తగినంత

తయారీ విధానం:

ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి. ఒక నాలుగు గంటలపాటు నీటిలో నానబెట్టాలి. నీటిని వడకట్టేసి, పప్పు ఒక గిన్నెలో వేయాలి. దాంట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, కొబ్బరి, ఉప్పు వేసి కలపితే వడపప్పు రెడీ అయినట్లే. పానకం, వడపప్పుని శ్రీరాముడికి నైవేద్యంగా పెట్టి.. భక్తులకు వితరణ చేయాలి.

Also Read: పవన్ కళ్యాణ్ పిల్లలతో అడవి శేషు.. లైవ్‌లో రిలేషన్ పై స్పందించిన రేణు దేశాయ్

సమ్మర్ సీజన్ లో పెళ్లిళ్ల సందడి మొదలు. అయితే మేకప్ కరిగిపోకుండా ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి..