
హనుమాన్ జయంతి రోజున ప్రత్యేకంగా నైవేద్యాలు వండి సమర్పించడం ద్వారా భగవంతుని కృప పొందవచ్చని నమ్మకం ఉంది. కుంకుమపువ్వుతో చేసిన స్వీట్ రెసిపీని అందించటం హనుమంతుడికి అత్యంత ప్రియమైనదిగా పరిగణించబడుతుంది. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మనం ఒక ప్రత్యేకమైన నైవేద్యం తయారు చేయబోతున్నాం. అది చాక్లెట్ కలిపిన కేసరి ఫిర్నీ. సాధారణంగా ఫిర్నీను పాలు, బాస్మతి బియ్యం, కుంకుమపువ్వు వాడి చేస్తారు. కానీ ఈసారి బోర్న్‌విల్లే డార్క్ చాక్లెట్‌ని కూడా కలిపి ఆ ఫిర్నీకి కొత్త రుచి, ప్రత్యేకత తీసుకురానున్నాం. ఇది దేవుడికి నైవేద్యంగా కూడా బాగా సరిపోతుంది.
మొదట బాస్మతి రైస్ ని 30 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత ఆ రైస్ లో కొద్దిగా నీరు పోసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ ఆన్ చేసి ఒక పెద్ద పాత్రలో పాలను తీసుకుని తక్కువ మంటపై వేడి చేస్తూ మరిగించాలి. పాలు మరిగిన తర్వాత అందులో రుబ్బిన రైస్ పేస్ట్ ని వేసి అడుగంటకుండా కలుపుతూ ఉడికించాలి. రైస్ పూర్తిగా ఉడికే వరకు అంటే దాదాపు 10 నుంచి 12 నిమిషాల వరకు నెమ్మదిగా వండాలి.
తరువాత చక్కెరను వేసి బాగా కలపాలి. ఆ వెంటనే కుంకుమపువ్వు నానబెట్టిన పాలను, యాలకుల పొడిని కూడా జత చేసి మరో ఐదు నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత స్టవ్ మంట తక్కువగా పెట్టి బోర్న్‌విల్లే చాక్లెట్‌ను అందులో వేసి అది పూర్తిగా కరిగి మిశ్రమంలో బాగా కలిసే వరకు నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. చాక్లెట్ పూర్తిగా కలిసిన తరువాత రోజ్ వాటర్ ని వేసి ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఈ ఫిర్నీ మిశ్రమం చల్లారిన తర్వాత చిన్న చిన్న మట్టి కప్పుల్లోకి తీసుకోని ఫ్రిడ్జ్‌లో రెండు నుంచి మూడు గంటల పాటు ఉంచాలి. ఇలా చేసిన ఫిర్నీ చల్లగా తినడానికి చాలా రుచిగా ఉండటంతో పాటు పూజా నైవేద్యంగా కూడా ప్రత్యేకతను చాటుతుంది.
ఫిర్నీ తయారయ్యాక పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ (బాదం, పిస్తా ముక్కలు) చల్లి కావాలంటే సిల్వర్ వార్క్ ను అలంకరణగా ఉపయోగించండి. ఈ ఫిర్నీని చల్లగా వడ్డిస్తే ఎంతో రుచిగా ఉంటుంది. ఇది నైవేద్యంగా అర్చించడానికి అద్భుతంగా ఉంటుంది. శ్రీ హనుమంతునికి భక్తితో ఈ మధురమైన ఫిర్నీని సమర్పించి ఆ తరువాత కుటుంబ సభ్యులతో కలిసి తినండి.