odhuma Rava Benefits: చలికాలంలో గోధుమ రవ్వ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే.. షాక్ అవుతారు!

| Edited By: Ram Naramaneni

Nov 12, 2023 | 9:38 PM

మనం ఆహారంగా తీసుకునే వాటిల్లో గోధుమ రవ్వ కూడా ఒకటి. చాలా మందికి గోధుమ రవ్వతో చేసే ఉప్మా అంటే అస్సలు నచ్చదు. కానీ ఈ రవ్వతో చేసే ఉప్మా తింటే అనేక బెనిఫిట్స్ ఉన్నాయన్న సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. ఈ గోధుమ రవ్వతో చేసిన ఉప్మా తింటే డయా బెటీస్, రక్త పోటు, గుండె జబ్బులు ఇలా ఏ సమస్యతో ఉన్న వారైనా తినవచ్చు. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అంతే కాకుండా గోధుమ తినడం వల్ల బరువు కూడా తగ్గొచ్చు. ఇందులో ముఖ్యంగా ఫైబర్..

odhuma Rava Benefits: చలికాలంలో గోధుమ రవ్వ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే.. షాక్ అవుతారు!
Godhuma Rava
Follow us on

మనం ఆహారంగా తీసుకునే వాటిల్లో గోధుమ రవ్వ కూడా ఒకటి. చాలా మందికి గోధుమ రవ్వతో చేసే ఉప్మా అంటే అస్సలు నచ్చదు. కానీ ఈ రవ్వతో చేసే ఉప్మా తింటే అనేక బెనిఫిట్స్ ఉన్నాయన్న సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. ఈ గోధుమ రవ్వతో చేసిన ఉప్మా తింటే డయా బెటీస్, రక్త పోటు, గుండె జబ్బులు ఇలా ఏ సమస్యతో ఉన్న వారైనా తినవచ్చు. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అంతే కాకుండా గోధుమ తినడం వల్ల బరువు కూడా తగ్గొచ్చు. ఇందులో ముఖ్యంగా ఫైబర్, ప్రోటీన్స్, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు గోధుమ రవ్వతో చేసే ఎలాంటి ఆహారాన్నైనా తీసుకోవచ్చు. ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు తగ్గుతారు:

గోధుమ రవ్వ ఉప్మాను కూరగాయలు అన్నీ వేసి చేస్తారు. కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వారు గోధుమ రవ్వ ఉప్మాను హ్యాపీగా తినవచ్చు. ఇందులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. అంతే కాకుండా ఇది కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఇతర ఆహార పదార్థాలు కూడా తీసుకోలేం. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇవి కూడా చదవండి

ప్రోటీన్స్:

గోధుమ రవ్వలో పుష్కలంగా ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే గోధుమ రవ్వతో తయారు చేసిన ఆహార పదార్థాలు ఏవైనా హ్యాపీగా తీసుకోవచ్చు. ఇలా కొవ్వు పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. అలాగే శరీరానికి కూడా మంచి ప్రోటీన్స్ అందుతాయి.

నెమ్మదిగా జీవక్రియ:

గోధుమ రవ్వ అరగడానికి కాస్త సమయం ఎక్కువగా పడుతుంది. కాబట్టి త్వరగా ఆకలిగా అనిపించదు. దీంతో ఇతర పదార్థాలు కూడా తినలేం. అయితే కొంత మందికి గోధుమ రవ్వతో జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. అలాంటి వారు దీనికి దూరంగా ఉండటమే బెటర్.

ఫైబర్:

గోధుమ రవ్వలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జీర్ణ వ్యవస్థ సజావుగా జరగడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే శరీరంలో అన్ని భాగాలు విధులు సరిగ్గా నిర్వహించడానికి ఇది హెల్ప్ చేస్తుంది.

డయాబెటీస్ అదుపులో ఉంటుంది:

డయాబెటీస్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిల్లో ఎలాంటి మార్పులు రావు. ఆహారాన్ని చక్కెరగా మారకుండా గోధుమ రవ్వ చూస్తుంది. కాబట్టి ఎలాంటి డౌట్స్ లేకుండా గోధుమ రవ్వను తీసుకోవచ్చు.

కొలెస్ట్రాల్ తగ్గుతుంది:

గోధుమ రవ్వను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది. ఎముకలు కూడా బలంగా మారతాయి. అంతే కాకుండా చర్మాన్ని మెరిసేలా చేయడంలో కూడా గోధుమ రవ్వ హెల్ప్ చేస్తుంది.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.