Roti Side Effect: ఎక్కువగా చపాతీలు తింటున్నారా.. అయితే, మీ ఆరోగ్యం ప్రమాదంలో పడే ఛాన్స్..

Health Tips: చాలా మంది ప్రజలు రోజూ గోధుమలతో చేసిన రోటీలను తింటుంటారు. గోధుమలలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ..

Roti Side Effect: ఎక్కువగా చపాతీలు తింటున్నారా.. అయితే, మీ ఆరోగ్యం ప్రమాదంలో పడే ఛాన్స్..
Roti

Updated on: Feb 15, 2022 | 8:40 AM

Roti Side Effect: దక్షిణ భారతదేశంలో తప్ప, దేశంలోని చాలా ప్రాంతాల్లో చపాతీలు లేదా రోటీని తినే అలవాటు ఉంది. రోటీలు వీరి ఆహారంలో ముఖ్యమైన భాగంగా ఉంటుంది. రోటీలు లేకుండా వీరి ఆకలి సంతృప్తి చెందదు. అన్నం కంటే రోటీ ఎక్కువ మేలు చేస్తుందని ఇలా తింటుంటారు. వీటిని తినడం వల్ల ఊబకాయం(Weight Gain) పెరగదని నమ్ముతారు. చాలా చోట్ల గోధుమలతో తయారుచేసిన రోటీలు మాత్రమే ఉపయోగిస్తుంటుంటారు. ఇవి తీసుకోవడం వల్ల శరీరంలో విషపూరిత పదార్థాలు ఏర్పడకుండా నిరోధిస్తాయి. రక్తాన్ని కూడా పూర్తి స్వచ్ఛంగా ఉంచుతాయి. రోటీలో చాలా కాల్షియం, ప్రోటీన్లు కూడా ఉంటాయి. ఇది ఎముకలను బలపరుస్తుంది.

ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రోటీ తినడానికి తేలికగా ఉంటుంది. మన జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే రోజూ బ్రెడ్‌ను ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం.. అది మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా. ఒక వార్తా కథనం ప్రకారం, రోజంతా రోటీలు మాత్రమే తినడం వల్ల శరీరానికి చాలా నష్టం వాటిల్లుతుంది. ఉదాహరణకు, ఇతర పోషకాలు అందకపోవడం, ఊబకాయం, రక్తంలో చక్కెర స్థాయి పెరగడం, అలసట మొదలైన సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి రోటీలను ఎక్కువగా తినడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో తెలుసుకుందాం.

రోటీలు తినడం వల్ల కలిగే నష్టాలు..

1. రక్తంలో చక్కెర స్థాయి..
చాలా మంది గోధుమలతో చేసిన రోటీలను తింటారు. గోధుమలలో కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇది బీపీని పెంచడానికి పని చేస్తుంది. ఎక్కువగా గోధుమ రొట్టెలు తింటుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

2. బరువు పెరగడం..
రోటీ తినడం వల్ల కూడా బరువు పెరగడానికి దారితీస్తుంది. వాస్తవానికి, గోధుమ రొట్టె అధిక వినియోగం శరీరంలో కార్బోహైడ్రేట్లను పెంచుతుంది. గోధుమలలో ఉండే గ్లూటెన్ పరిమాణం పెరుగుదల కారణంగా, శరీరంలో కొవ్వు ఏర్పడుతుంది.

3. అలసట..
రోటీలో ఉండే కార్బోహైడ్రేట్ అలసటను పెంచడానికి కూడా పనిచేస్తుంది. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో బద్ధకం పెరిగి అలసట, నీరసం మొదలవుతాయి.

4. బాడీ వార్మింగ్..
మీరు ఎక్కువ రోటీలు తిన్నప్పుడు, శరీరంలో వేడి ఉత్పత్తి పెరుగుతుంది. దీని కారణంగా శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుంది. అధిక చెమట కూడా ఏర్పడుతుంది. దీని కారణంగా శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది.

5. గుండె జబ్బులు..
రోటీల్లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో అదనపు కార్బోహైడ్రేట్లు చేరడం వల్ల.. అది కొవ్వుగా మారుతుంది. ఇది గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం సమస్యకు కారణమవుతుంది.

6. కడుపు ఉబ్బరం..
రోటీ తిన్నాక చాలా సార్లు కడుపు బరువుగా అనిపించడంతోపాటు వాత సమస్య కూడా ఉంటుంది. చాలా మంది గ్యాస్, జీర్ణ సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి, రోటీని నియంత్రిత పరిమాణంలో తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది.

7. ప్రోటీన్ లోపం..
మీరు రోజంతా రోటీని మాత్రమే తీసుకుంటే, శరీరంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్ లోపం ఏర్పడుతుంది. దీని వల్ల శరీరంలో ఊబకాయం వంటి అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. దీంతో తక్కువ సంఖ్యలో రోటీలను తీసుకోవడం చాలా మంచింది. అన్ని రకాల ధాన్యాలు, పండ్లు, కూరగాయలను చేర్చుకోవడం చాలా మంచింది.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు, చిట్కాలు కేవలం సూచనలుగా మాత్రమే పరిగణించండి. ఇలాంటి చిట్కాలు, సూచనలు పాటించే ముందు డాక్టర్‌ను సంప్రదించడం మంచింది.

Also Read: Weight Loss Tips: ఎక్కువ సేపు నిద్రపోతే బరువు తగ్గుతారట.. పరిశోధనలో షాకింగ్‌ నిజాలు..

High Protein Lentils: ఈజీగా బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఈ పప్పు దినుసులను ఆహారంలో చేర్చుకోండి..