
Afghani Chicken
బయట వర్షం పడుతుంటే మీరు వేడిగా, రుచికరమైన వంటకాన్ని ఆస్వాదించాలనుకుంటే క్రిస్పీ స్నాక్స్ ను ఎంచుకుంటారు కొంతమంది. అయితే నాన్ వెజ్ ప్రియులు ముఖ్యంగా వర్షాకాలంలో ఏదైనా ప్రత్యేకంగా తయారు చేసి తినాలని భావిస్తే.. ముఖ్యంగా చికెన్ ప్రియులైతే ఆఫ్ఘని చికెన్ గొప్ప ఎంపిక కావచ్చు. సాధారణంగా ప్రజలు ఈ ఆఫ్ఘని చికెన్ ని రెస్టారెంట్లలో మాత్రమే బాగా చేస్తారని అనుకుంటారు. రెస్టారెంట్ లోనే ఆఫ్ఘని చికెన్ ని తినవచ్చని భావిస్తారు. అయితే దీనిని ఆఫ్ఘని చికెన్ ని రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.
ఆఫ్ఘని చికెన్ చేయడానికి కావలసిన పదార్థాలు
- చికెన్ – 500 గ్రాములు (కాలు లేదా ఎముకలు లేని చికెన్ ముక్కలు)
- పెరుగు-1/2 కప్పు
- తాజా క్రీమ్-1/4 కప్పు
- అల్లం-వెల్లుల్లి పేస్ట్- 1 టేబుల్ స్పూన్
- నిమ్మరసం-1 టేబుల్ స్పూన్
- జీడిపప్పు పేస్ట్- 2 టేబుల్ స్పూన్లు
- మిరియాల పొడి- 1/2 టీస్పూన్
- గరం మసాలా- 1 స్పూన్
- ఉప్పు- రుచికి సరిపడా
- నూనె/నెయ్యి- 2 టేబుల్ స్పూన్లు
- బొగ్గు (పొగ రుచి కోసం – ఐచ్ఛికం)
తయారీ విధానం:
- ముందుగా చికెన్‌ను బాగా శుభ్రంగా కడిగి.. ఒక గిన్నెలోకి తీసుకుని చికెన్ ను తీసుకుని దానిపై నిమ్మరసం, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి మ్యారినేట్ చేసి 30 నిమిషాలు పాటు పక్కకు పెట్టుకోండి.
- ఇప్పుడు మరొక గిన్నెలో పెరుగు, జీడిపప్పు పేస్ట్, మిరియాల పొడి, గరం మసాలా, క్రీమ్ కలపండి. ఈ మిశ్రమాన్ని చికెన్ మీద అప్లై చేసి కనీసం 2 గంటలు ఫ్రిజ్‌లో ఉంచండి.
- ఒక పాన్ లో నూనె/నెయ్యి వేడి చేసి మ్యారినేట్ చేసిన చికెన్ ను తక్కువ మంట మీద ఉడికించి.. అన్ని వైపులా బంగారు రంగు వచ్చేలా తిప్పుతూ ఉండండి.
- మీకు స్మోకీ ఫ్లేవర్ ఇష్టం అయితే కొంచెం బొగ్గు వెలిగించి.. ఆ బొగ్గుని చికెన్ పైన ఉంచండి. మీకు కావాలంటే చికెన్‌ను నిప్పుల మీద పెట్టి కాసేపు కాల్చవచ్చు. దీని తర్వాత చికెన్ పైన నెయ్యి వేయండి.
- అంతే వేడి వేడి ఆఫ్ఘని చికెన్ రెడీ. ఇప్పుడు వేడి వేడి ఆఫ్ఘని చికెన్‌ను గ్రీన్ చట్నీ, ఉల్లిపాయలను వేసి వేడి రోటీలతో వడ్డించండి. తిన్నవారు ఆహా ఏమి రుచి అనాల్సిందే ఎవరైనా..
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..