Chicken Fry Piece Pulav: చికెన్ ఫ్రై పీస్ పులావ్ అంటే ఇష్టమా.. రెస్టారెంట్ స్టైల్‌లో ఇలా తయారు చేసుకోండి..

|

Nov 30, 2024 | 12:29 PM

మాంసాహార ప్రియుల్లో చికెన్ ప్రియులు వేరు. చికెన్ అంటే చాలు ఆకలి లేదు అన్నవారు కూడా తినడానికి రెడీ అయిపోతారు. చికెన్ తో రకరకాల ఆహార పదార్ధాలను తయారు చేసుకోవచ్చు. చికెన్ కూర, చికెన్ వేపుడు, చికెన్ పికిల్, చికెన్ బిర్యానీ ఇలా రకరకాల ఆహార పదార్ధాలను తయారు చేస్తారు. అయితే చికెన్ బిర్యానీని ఇష్టంగా తింటారు. ఈ రోజు రెస్టారెంట్ స్టైల్ లో చికెన్ ఫ్రై పీస్ పులావ్ తయారీ గురించి తెలుసుకుందాం..

Chicken Fry Piece Pulav: చికెన్ ఫ్రై పీస్ పులావ్ అంటే ఇష్టమా.. రెస్టారెంట్ స్టైల్‌లో ఇలా తయారు చేసుకోండి..
Chicken Fry Piece Pulav Recipe
Follow us on

చికెన్‌తో రకరకాల ఆహార పదార్ధాలను తయారు చేసుకోవచ్చు. అయితే ఎక్కువ మంది చికెన్ ఫ్రై పీస్ పులావ్ ని తినడానికి ఇష్టపడతారు. ఈ చికెన్ ఫ్రై పీస్ పులావ్ ఇష్టం ఉన్నా సరే రెస్టారెంట్ లో మాత్రమే తినగలరు. ఎందుకంటే దీని తయారీ విధానం తెలియక పోవడమే.. ఈ రోజు రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే చికెన్ ఫ్రై పీస్ పులావ్ తయారీ విధానం తెలుసుకుందాం.. ఇలా చేస్తే.. చికెన్ ఫ్రై పీస్ పులావ్ అద్భుతంగా తయారు చేసుకోవచ్చు. ఈ రోజు చికెన్ ఫ్రై పీస్ పులావ్ తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. రెసిపీ గురించి తెలుసుకుందాం..

చికెన్ ఫ్రై పీస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

  1. బోన్ లెస్ చికెన్ : ఒక కేజీ
  2. ధ‌నియాల పొడి:ఒక టీ స్పూన్‌
  3. జీల‌క‌ర్ర పొడి : ఒక టీ స్పూన్‌
  4. గ‌రం మ‌సాలా: ఒక టీ స్పూన్‌
  5. ఇవి కూడా చదవండి
  6. ఉల్లిపాయలు : రెండు కప్పులు (తరిగిన ముక్కలు)
  7. అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక టీ స్పూన్‌
  8. ప‌చ్చి మిరపకాయలు: నాలుగు
  9. కరివేపాకు: రెండు రెమ్మలు
  10. కారం : ఒక టీ స్పూన్‌
  11. ప‌సుపు: చిటికెడు
  12. నూనె : ఒక క‌ప్పు
  13. ఉప్పు : రుచికి త‌గినంత‌
  14. కొత్తిమీర : కొంచెం
  15. పుదీనా: కొద్దిగా

పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

  1. బాస్మతి బియ్యం: 1 కేజీ
  2. అల్లం వెల్లుల్లి పేస్ట్ : ఒక స్పూన్
  3. పులావ్ మ‌సాలా: ఒక టీ స్పూన్
  4. ప‌చ్చి మిర్చి: త‌రిగిన ముక్కలు పావు క‌ప్పు
  5. దాల్చిన చెక్క : 2
  6. ల‌వంగాలు : 8
  7. యాల‌కులు : 8
  8. మిరియాలు : కొంచెం
  9. జాజి పువ్వు : 3
  10. జాప‌త్రి : 3
  11. కొత్తిమీర : కొంచెం
  12. పుదీనా: కొంచెం
  13. ఉప్పు : త‌గినంత‌
  14. నీరు తగినంత
  15. నెయ్యి : ఒక స్పూన్

చికెన్ ఫ్రై పీస్ పులావ్ త‌యారీ విధానం:

ముందు బాస్మతి బియ్యం కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఇంతలో చికెన్ శుభ్రం చేసుకోవాలి. గంట తర్వాత ఒక పెద్ద దళసరి గిన్నెను తీసుకుని స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసి వేడి ఎక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ , ప‌చ్చి మిర్చి ముక్కలు, దాల్చిన చెక్క, ల‌వంగాలు, యాల‌కులు , మిరియాలు, జాజి పువ్వు, జాప‌త్రి, వేసి వేయించి బియ్యం వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పులావ్ మ‌సాలా వేసి కొత్తిమీర, పుదీనా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు బియ్యం ఉడ‌కడానికి మూడు వంతుల నీటిని పోసి ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు బాస్మతి బియ్యం సగం కంటే తక్కువ ఉడికించిన తర్వాత ఈ రైస్ నుంచి నీరు తీసి పక్కకు పెట్టుకోవాలి.

చికెన్ పీసెస్ తయారీ విధానం

ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో నీరు పోసుకుని శుభ్రం చేసుకున్న చికెన్ వేసి పావు గంట ఉడికించుకోవాలి. తర్వాత చికెన్ ఫ్రై పీస్ పులావ్ తయారు చేసుకోవడానికి స‌రిప‌డా గిన్నెను గ్యాస్ స్టవ్ మీద పెట్టి వేడి ఎక్కిన తర్వాత కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసి వేడి ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. ఉల్లి పాయ ముక్కలు వేగిన అనంతరం ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి, గ‌రం మ‌సాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ , ప‌చ్చి మిరపకాయ ముక్కలు, కరివేపాకు, కారం, ప‌సుపు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఉడికించి పక్కకు పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి బాగా కలిపి వేయించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసి వేయించుకుని అప్పుడు ఈ చికెన్ లో రెడీ చేసుకున్న సగం ఉడికిన బాసుమతి బియ్యం వేసి ఇప్పుడు బియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత పైన వేయించిన ఉల్లిపాయ ముక్కలు.. కొత్తిమీర, పుదీనా ముక్కలు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే రెస్టారెంట్ స్టైల్ లో చికెన్ ఫ్రై పీస్ పులావ్ రెడీ. దీనిని ఇలాగే తినొచ్చు.. లేదా రైతా తో తినొచ్చు.

 

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..