Red Tomato Health Benefits: న్యూట్రిషనిస్టులు టమోటోస్‌ని అత్యంత శక్తివంతమైన పండ్లుగా భావిస్తారు. వీటిని వండుకొని తినవచ్చు లేదంటే పచ్చిగా కూడా తినవచ్చు. టమాటోస్‌లో విటమిన్ ఎ, సి, కె, బి 1, బి 3, బి 5, బి 6, బి 7 వంటి సహజ విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇందులో ఫోలేట్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, క్రోమియం, కోలిన్, జింక్, భాస్వరం కూడా ఉంటాయి. ఈ విటమిన్లు, ఖనిజాలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. టమోటాలలో ఫైటోకెమికల్స్‌లో అధికంగా ఉంటాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే టమోటాలను తొక్కతో తింటే చాలా మంచిది.
1. క్యాన్సర్ నివారణ
క్యాన్సర్ నివారణకు టమోటాలు చాలా సహాయం చేస్తాయి. టొమాటోస్‌లో లైకోపీన్ అనే రసాయన మూలకం ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో తోడ్పడుతుంది. టమోటాలలో లైకోపీన్, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. వారానికి కనీసం పది లేదా అంతకంటే ఎక్కువ టమోటాలు తినే వ్యక్తులకు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
2. గుండె రోగులు
టమోటా గుండె జబ్బుల నివారణకు పనిచేస్తుంది. ఇందులో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్, కోలిన్ పుష్కలంగా ఉంటాయి. మీరు ఎక్కువ మొత్తంలో పొటాషియం తీసుకోవాలనుకుంటే సలాడ్ రూపంలో టమోటాను తినండి. రోజుకు 4039 మిల్లీగ్రాముల పొటాషియం తీసుకునే వ్యక్తులు గుండె సమస్యల ప్రమాదం నుంచి బయటపడుతారని పరిశోధనలో వెల్లడైంది.
3. గర్భధారణ సమయంలో ప్రయోజనకరంగా ఉంటుంది
టమాటో గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు శిశువు, స్త్రీ ఇద్దరికీ అవసరం. అందుకే గర్భిణులు కచ్చితంగా టమోటాను ఆహారంలో చేర్చుకోవాలి.
4. చర్మం కోసం
టమాటో ఆరోగ్యానికి అలాగే చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే లైకోపీన్ సూర్యుని హానికరమైన UV కిరణాల నుంచి రక్షిస్తుంది. చర్మంపై టమోట రసం అప్లై చేస్తే మృదువుగా తయారవుతుంది.
5. రోగనిరోధక శక్తిని పెంచుతాయి
ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. టమోటాలలో విటమిన్ సి ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు విటమిన్ సి ఒత్తిడి హార్మోన్ల పెరుగుదలను నియంత్రించగలదు.