Chicken Sweet Corn Soup: వర్షాకాలంలో మాంసాహార ప్రియుల కోసం హాట్ అండ్ స్పైసీ చికెన్ స్వీట్ కార్న్ సూప్ తయారీ

Chicken Sweet Corn Soup: వేసవి కాలంలో చల్లని పదార్ధాలను ఎలా తగలనుకుంటామో.. అదే వర్షాకాలం వచ్చిందంటే.. వాతావరణంలోని చల్లదనం ఉంటుంది. దీంతో వాన పడుతుంటే.. మనసు..

Chicken Sweet Corn Soup: వర్షాకాలంలో మాంసాహార ప్రియుల కోసం హాట్ అండ్ స్పైసీ చికెన్ స్వీట్ కార్న్ సూప్ తయారీ
Chicken Sweet Corn Soup

Edited By: Surya Kala

Updated on: Jul 12, 2021 | 1:27 PM

Chicken Sweet Corn Soup: వేసవి కాలంలో చల్లని పదార్ధాలను ఎలా తగలనుకుంటామో.. అదే వర్షాకాలం వచ్చిందంటే.. వాతావరణంలోని చల్లదనం ఉంటుంది. దీంతో వాన పడుతుంటే.. మనసు వేడి వేడిగా ఏదైనా తినాలని.. లేదంటే వేడి వేడి కాఫీ, టీలు తాగాలని అనిపిస్తుంది. అయితే వర్షాకాలంలో వేడి వేడిగా ఏదైనా తాగాలనిపిస్తే.. టీ, కాఫీలు బదులు సూప్స్ ను తాగవచ్చు. ఈ సూప్స్ ఆరోగ్యానికి మంచివి కూడా.. కూరగాయలతోనే కాదు.. నాన్ వెజ్ తో కూడా సూప్స్ ను ఇంట్లో రుచికరంగా తయారు చేసుకోవచ్చు. ఈరోజు మాంసాహార ప్రియుల కోసం రుచికరమైన చికెన్ స్వీట్ కార్న్ సూప్ తయారీ గురించి తెలుసుకుందాం.. ఇది తయారు చేయడం చాలా ఈజీ కూడా

కావాల్సిన పదార్ధాలు :

బోన్ లెస్ చికెన్ ముక్కలు – 100 గ్రాములు
స్వీట్ కార్న్ గింజలు – 2 కప్పులు
క్యారెట్ – అరకప్పు చిన్న ముక్కలు
క్యాబేజ్ – అరకప్పు చిన్న చిన్న తురుము
పెప్పర్ పౌడర్ – 1 టీస్పూన్
కారం – 1/2 టీస్పూన్
కార్న్ ఫ్లోర్ – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా,
నూనె – తగినంత
పసుపు – కొద్దిగా
రెండు లీటర్ల నీరు

తయారీ విధానం :

ముందుగా ఒక గిన్నెలో చికెన్ తీసుకుని నీరు పోయాలి.. అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి .. ఆ చికెన్ ను ఒక్క నిమిషం పాటు ఉంచి.. తర్వాత ఆ నీరు తీసేసి.. చికెన్ ను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని స్టౌ మీద పెట్టి.. కొంచెం నూనె వేయాలి. నూనె వేడి ఎక్కిన తర్వాతగా అందులో స్వీట్ కార్న్, సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలను. క్యాబేజీ ముక్కలను వేయాలి.. కొంచెం వేయించిన తర్వాత అందులో రెండు లీటర్ల నీరు పోసుకోవాలి. నీరు వేడి ఎక్కిన తర్వాత స్వీట్ కార్న్, క్యాబీజీ, క్యారెట్ ముక్కలను మిక్స్ చేసే విధంగా కలపాలి.. తర్వాత ఆ మిశ్రమంలో పెప్పర్ పౌడర్, కారం పొడి వేసి బాగా కలపాలి.. తర్వాత చికెన్ ముక్కలను వేసి మిక్స్ చేయాలి. ఆ నీటిలో చికెన్ ఉడుకుతున్న సమయంలో ఒక చిన్న గిన్నె తీసుకుని కార్న్ ప్లోర్ వేసుకుని.. నీరు వేసి.. ఉండలు లేకుండా కలపాలి. తర్వాత స్టౌ మీద ఉడుకుతున్న స్వీట్ కార్న్ చికెన్ మిశ్రమంలో కార్న్ ప్లోర్ వాటర్ ను పోసి.. ఉండలు కట్టకుండా కలపాలి.. అనంతరం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత చికెన్ ముక్కలు ఉడికేంత వరకూ ఈ మిశ్రమాన్ని కలుపుతూ..దాదాపు 15నిమిషాల వరకూ ఉడకనివ్వాలి. అంతే ఇనిస్టెంట్ గా దొరికే చికెన్ స్వీట్ కార్న్ సూప్ రుచికి సరిసమానమైన హాట్ అండ్ స్పైసీ చికెన్ స్వీట్ కార్న్ సూప్ రెడీ. ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి.. ఇక రోజూ టీ కాఫీలు బదులు రకరకాల సూప్స్ నే తయారు చేసుకోవాటానికి తాగడానికి ఇష్టపడతారు.

Also Read: బాల్యంలో చెల్లెలి మరణంతో.. డిప్రెషన్ లోకి వెళ్లి.. గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న కోలీవుడ్ స్టార్ హీరో..