Ragi Health Benefits: రాగి జావతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ఆ రోగాలన్నింటికీ చెక్ పెట్టొచ్చు తెలుసా..

Ragi Malt Benefits: క్రీస్తుపూర్వం నాటి నుంచి దేశంలో అత్యధికంగా వినియోగంలో ఉన్న తృణధాన్యాల ఆహారంలో రాగులు ఒకటి. ఈ రాగులలో కాల్షియం, పొటాషియం,

Ragi Health Benefits: రాగి జావతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ఆ రోగాలన్నింటికీ చెక్ పెట్టొచ్చు తెలుసా..
Ragi Malt

Updated on: Jan 22, 2022 | 6:56 AM

Ragi Malt Benefits: క్రీస్తుపూర్వం నాటి నుంచి దేశంలో అత్యధికంగా వినియోగంలో ఉన్న తృణధాన్యాల ఆహారంలో రాగులు ఒకటి. ఈ రాగులలో కాల్షియం, పొటాషియం, కార్పోహైడ్రేట్లు, ఫైబర్, కొవ్వు పదార్థాలు అధికంగా ఉన్నాయి. దీంతోపాటు బి విటమిన్లు, ఐరన్ లాంటివి సమృద్ధిగా ఉన్నాయి. రాగులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రాగులను ఎలా తీసుకున్నా.. పలు రోగాలకు చెక్ పెట్టవచ్చని పేర్కొంటున్నారు. అయితే.. రోజూ రాగి జావ తాగితే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రోజూ ఉదయాన్ని రాగి జావ తాగితే చాలా రోగాలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు అభిప్రాయడుతున్నారు. రాగులను ఉప్మాలా చేసుకోని తిన్నా.. శరీరానికి అధిక బలం చేకూరుతుంది. మొలకెత్తిన రాగులు తిన్నా మేలే. ముఖ్యంగా శరీరానికి చేకూర్చే బలమైన పోషకాలన్నీ రాగులల్లో లభిస్తాయి. రాగుల్లో గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉన్నాయి. కావున రాగులు మధుమేహ రోగులకు మంచి ఆహారం. రాగులలో రక్తంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించి గుండెను రక్షిస్తాయని పేర్కొంటున్నారు. రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది.

రాగుల్లో ఎక్కువగా పీచు పదార్ధాలు ఉన్నాయి. కావున వీటివల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటమే కాక, పేగులలో పుండ్లు, అతిసార, పెద్ద పేగు కాన్సర్‌ నుంచి రక్షణ లభిస్తుంది. బరువును కూడా తగ్గిస్తాయి. రాగులు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి అంటు వ్యాధుల బారి నుంచి రక్షిస్తాయి. రక్తహీనత సమస్యను దూరం చేస్తాయి. నాడీ వ్యవస్థ పనితీరును పెంచుతాయి. ఎముకలు ధృఢంగా ఉంచడమే కాకుండా కండరాలకు బలం చేకూరుతుంది. కావున ఉదయాన్నే రాగి జావ తాగితే.. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చంటున్నారు నిపుణులు.

తయారీ విధానం..
వేడి నీటిలో తగినంత రాగి పిండి కలిపాలి. ఆ తర్వాత జావలా చేసుకోవాలి. దీని రుచి కోసం కొంచెం మజ్జిగ, బెల్లం లాంటివి కలుపుకోని తాగవచ్చు. అయితే ఉదయాన్నే తాగితే చాలా మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read:

Health Tips: డిప్రెషన్‌తో బాధపడుతున్నారా.. ఖచ్చితంగా ఈ 3 పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాల్సిందే..!

Winter Care Tips: రోగనిరోధక శక్తి పెరగాలంటే.. మీ డైట్‌లో ఇవి తప్పక ఉండాల్సిందే..!