Prawns Fry Recipe: సీఫుడ్ లవర్స్ కు వెంటనే మనసుకు తట్టేవి.. రొయ్యలు. ఇవి మంచి పౌష్టికాహారం.. అంతేకాదు రొయ్యలు బరువు తగ్గడానికి మంచి సహకారిగా ఉపయోగపడుతుంది. డైట్ చేసే వారు రొయ్యలను తమ ఆహారంలో చేర్చుకోమని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. అయితే ఈ రొయ్యలతో అనేక రకాల వంటలను తయారు చేయవచ్చు. ముఖ్యంగా గోదావరి జిల్లా వాసులకు ఈ రొయ్యలతో ప్రత్యేక అనుబంధం ఉంది. రోజు ఏదొక కూరలో రొయ్యలను కలిసి కూరతయారు చేస్తారు. అంతేకాదు ఈ రొయ్యల స్పెషాలిటీ ఏమిటంటే.. రొయ్యలను విడిగా కూరగా వండుకోవచ్చు.. లేదా గుడ్లు, బీరకాయ, పాలకూర, తోటకూర, టమాటా ఇలా ఇతర వాటిల్లో కూడా కలిపి వండుకోవచ్చు. ఈ రోజు రొయ్యల ఫ్రై తయారీ గురించి తెలుసుకుందాం.
రొయ్యలు
ఉల్లిపాయలు
టమాటా ప్యూరీ – ఒక టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి
ధనియాలు – ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర – టీ స్పూన్
గసగసాలు – టేబుల్ స్పూన్
అల్లం – చిన్న ముక్క
వెల్లుల్లి రేకలు – ఆరు
కారం – 11/2 స్పూన్
పసుపు – కొంచెం
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర – ఒక కట్ట
జీడిపప్పు
నూనె – తగినంత
కరివేపాకు
రొయ్యలను ముందుగా శుభ్రం చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ధనియాలు, గసగసాలు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి, జీడిపప్పు , జీలకర్ర ను మిక్సీలో వేసుకుని పేస్ట్ గా తయారు చేసుకోవాలి. తర్వాత స్టౌ వెలిగించి బాణలి పెట్టి.. నూనె వేసి.. వేడి అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి కొంచెం ఉప్పు వేసుకుని వేయించుకోవాలి. తర్వాత రొయ్యలు వేసుకుని పసుపు వేసుకుని వేయించుకోవాలి. రొయ్యలు నూనె లో వేగిన అనంతరం టమాటా ప్యూరీ వేసుకుని కొంచెంసేపు వేయించాలి. తర్వాత దానిలో మసాలా పేస్ట్ ను వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని వేయించాలి. రొయ్యలు ఉడికిన తర్వాత ఉప్పు చూసుకుని చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకుని స్టౌ మీద నుంచి రొయ్యల ఫ్రై ను దింపేసుకోవాలి. అంతే గోదావరి జిల్లాల స్టైల్ లో టేస్టీ టేస్టీ గా రొయ్యల ఫ్రై రెడీ .
Also Read: Covid-19: కోవిడ్‌కు చెక్ పెట్టేదిశగా ఆయుర్వేదం.. అశ్వగంధతో ఔషధం.. యూకేలో క్లినికల్ ట్రయల్స్