పైనాపిల్ ను అనాస పండు అని కూడా అంటారు. పైనాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది.. ఇది భారతదేశం కాకుండా థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, కెన్యా, చైనా మరియు ఫిలిప్పీన్స్‌లో కూడా కనిపిస్తుంది. రుచికి తియ్యగా, పుల్లగా భలే రుచిగా ఉంటుంది. ప్రతి రోజు డైట్ లో తప్పకుండా ఏదో ఒక పండ్లని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. అలానే మీరు పైనాపిల్ తీసుకున్నా కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే పైనాపిల్ జ్యూస్ వల్ల ప్రయోజనాలు కూడా అన్నీ ఇన్నీ కావు..ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. అయితే మెరుగైన చర్మ సౌందర్యం కోసం పైనాపిల్ ను ఉపయోగిస్తే అద్భుత ఫలితం ఉంటుంది. పైనాపిల్ జ్యూస్ లో బ్రోమైలిన్ అనే ఎంజాయ్ ఉంటుంది. ఇది మొటిమలను తగ్గించడమే కాకుండా చర్మానికి తగినంత తేమను అందించి తాజాగా ఉంచుతుంది. అలాగే కోల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మంపై ముడుతలు లేకుండా చేస్తుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు.
పైనాపిల్‌లోని తీపి, పులుపు కారణంగా చాలా మంది ఇష్టపడతారు. కొందరు పండును పంచదార, తేనె, కారం,నల్ల మిరియాల పొడి కలిపి తింటారు. పండ్లను కాక్టెయిల్స్‌లో కూడా ఉపయోగిస్తారు. పైనాపిల్, దాని రసాన్ని వివిధ రోగాలకు చికిత్స చేయడానికి, రోగాలను నివారించడానికి ఆయుర్వేద వైద్యంలోనూ ఉపయోగిస్తారు. ఆధునిక పరిశోధనలు పైనాపిల్ జ్యూస్,దాని సమ్మేళనాలను ఆరోగ్య ప్రయోజనాలతో అనుసంధానించాయి. అవి మెరుగైన జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం, వాపు, కొన్ని రకాల క్యాన్సర్‌ల నుండి రక్షణ వంటివి. అయితే, ఈ అంశంపై మరింత పరిశోధన అవసరం.
1. పైనాపిల్ రసంలో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా మాంగనీస్, కాపర్, విటమిన్ బి6, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, గాయం నయంకావటం, శక్తి ఉత్పత్తి చేయటానికి, కణజాల సంశ్లేషణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.ఇందులో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, జింక్, కోలిన్, విటమిన్లు కె మరియు బి కూడా ఉంటాయి.
2. యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం… పైనాపిల్ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ శరీరాన్ని డ్యామేజ్ నుండి, ఇతర వ్యాధుల నుండి కాపాడుతుంది. ఇందులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్‌ల సమూహం కూడా ఉంటుంది. ఇది వాపును తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
3. మంటను తగ్గిస్తుంది.. పైనాపిల్ రసంలో బ్రోమెలైన్, గాయాలు నయం చేసే గుణం, శస్త్రచికిత్స, ఆర్థరైటిస్ లేదా ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల కలిగే వాపును తగ్గించడంలో సహాయపడే ఎంజైమ్‌ల సమూహం ఉంటుంది . అయితే, ఈ అంశంపై మరింత పరిశోధన అవసరం.
4. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. అనేక పరిశోధనలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో పైనాపిల్ రసం కీలక పాత్ర పోషిస్తుందని సూచిస్తున్నాయి. ఇది యాంటీబయాటిక్స్ ప్రభావాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది.
5. పైనాపిల్ జ్యూస్‌లో బ్రోమెలైన్ కూడా ఉంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. హానికరమైన, అతిసారం కలిగించే బ్యాక్టీరియా నుండి రక్షిస్తుంది. ఇన్ఫ్లమేటరీ ప్రేగు రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులలో మంటను తగ్గిస్తుంది.
6. గుండెకు ఆరోగ్యం.. పైనాపిల్స్‌లోని బ్రోమెలైన్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలలో కనుగొనబడింది. అయితే, దీనిపై మరింత పరిశోధన అవసరం.
7. అనేక రకాల క్యాన్సర్‌తో పోరాడవచ్చు.. బ్రోమెలైన్ జీర్ణక్రియ, గుండె ఆరోగ్యంతో పాటు అనేక రకాల క్యాన్సర్‌ల నుండి మిమ్మల్ని కాపాడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
8. ఆస్తమా లక్షణాలను కూడా తగ్గించవచ్చు పైనాపిల్ రసం కూడా ఉబ్బసంతో సంబంధం ఉన్న లక్షణాలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. జంతు అధ్యయనాలలో, బ్రోమెలైన్ యొక్క శోథ నిరోధక ప్రభావాలు ఉబ్బసం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. అదనంగా, ఇందులో ఉండే విటమిన్-సి జలుబు మరియు ఫ్లూ నుండి రక్షించడానికి కూడా పనిచేస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
ఇతర ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి