AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగాళాదుంప మంచిదే కానీ.. ఈ రెండు సమస్యలున్న వారు తింటే దుంపతెంచుతుంది..

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన కూరగాయలలో బంగాళాదుంపలు ఒకటి.. ఇది దాదాపు ప్రతి వంటగదిలో లభించే ముఖ్యమైన ఆహార పదార్థం. ఉత్తరాదిలో అయినా, దక్షిణాదిలో అయినా, బంగాళాదుంపలకు ఎంతో ప్రత్యేకత ఉంది.. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ దీన్ని తినడానికి ఇష్టపడతారు.

బంగాళాదుంప మంచిదే కానీ.. ఈ రెండు సమస్యలున్న వారు తింటే దుంపతెంచుతుంది..
Potatoes
Shaik Madar Saheb
|

Updated on: Mar 16, 2025 | 10:49 AM

Share

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన కూరగాయలలో బంగాళాదుంపలు ఒకటి.. ఇది దాదాపు ప్రతి వంటగదిలో లభించే ముఖ్యమైన ఆహార పదార్థం. ఉత్తరాదిలో అయినా, దక్షిణాదిలో అయినా, బంగాళాదుంపలకు ఎంతో ప్రత్యేకత ఉంది.. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ దీన్ని తినడానికి ఇష్టపడతారు. రుచికరంగా ఉండటమే కాకుండా, అనేక పోషకాలను అందించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇతర కూరగాయలతో పోలిస్తే, బంగాళాదుంపలు తక్కువ ధరకే లభిస్తాయి. దీనిని వివిధ వంటకాల్లో ఉపయోగించవచ్చు. సరైన మొత్తంలో తీసుకుంటే, అది శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇంకా అనేక వ్యాధులను నివారిస్తుంది.

బంగాళాదుంపల్లో ఎన్నో పోషకాలు..

పరిశోధనల ప్రకారం.. బంగాళాదుంపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆలుగడ్డల్లో కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉండటంతో పాటు, విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి.

బంగాళాదుంపలలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి త్వరగా శక్తిని అందిస్తాయి. కఠినమైన శారీరక శ్రమ చేసే వారికి ఇది ఒక అద్భుతమైన ఆహారం. బంగాళాదుంపలలో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో బంగాళాదుంపలు ఉపయోగపడతాయి.

బంగాళాదుంపలలో కాల్షియం – భాస్వరం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. బంగాళాదుంపలలోని విటమిన్ బి6 మెదడు అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇవి ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి. అన్ని వయసుల వారికి తగినది అయినప్పటికీ, కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు బంగాళాదుంప తీసుకోవడం పరిమితం చేయాలి. అయితే, అందరూ బంగాళాదుంపలు తినకూడదని.. అవి కొందరి ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

డయాబెటిస్, మూత్ర పిండాల్లో రాళ్ల సమస్య..

బంగాళాదుంపల అధిక గ్లైసెమిక్ సూచిక రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. కాబట్టి, మధుమేహం ఉన్నవారు బంగాళాదుంపలను మితంగా తినాలి.

అదనంగా, బంగాళదుంపల్లో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది.. కాబట్టి, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు బంగాళాదుంపల వినియోగాన్ని తగ్గించాలి.

చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు శరీరానికి హానికరం.. ఎందుకంటే వాటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ అధిక స్థాయిలో ఉంటాయి. బంగాళాదుంపలు పోషకాలతో నిండిన అద్భుతమైన ఆహారం. కానీ దానిని సరైన మొత్తంలో తీసుకోవడం అవసరం. ఇది శరీరానికి అవసరమైన శక్తిని, పోషకాలను పొందడానికి.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..