AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ginger Benefits: ప్రతిరోజూ అల్లం తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి డయాబెటిక్ రోగులకు మేలు చేస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో అల్లం తినడం లేదా అల్లం నీరు తాగడం శరీర డిటాక్స్‌కు సహాయపడుతుంది. ఒక నెలపాటు ప్రతిరోజూ అల్లం తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అల్లంలోని పదార్థాల వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్‌ల పరిమాణం తగ్గుతుంది. 

Ginger Benefits: ప్రతిరోజూ అల్లం తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
Ginger
Jyothi Gadda
|

Updated on: Mar 16, 2025 | 11:10 AM

Share

ప్రతి వంటింట్లో వాడే అతి ముఖ్యమైన మసాలా అల్లం.. ఇది వంటకాలకు మంచి రుచిని అందిస్తుంది. అయితే, అల్లం వంటలకు కేవలం మంచి రుచిని ఇవ్వడమే కాదు.. ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమెటరీ గుణాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. ఆకలిని పెంచడంలో అల్లం బాగా సహాయ పడుతుంది. ముఖ్యంగా కీమోథెరపీ, రేడియోథెరపీ, క్యాన్సర్ బాధితులకు ఆకలి తగ్గిపోతుంది. అలాగే ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి కొన్నిసార్లు ఆకలిగా అనిపించదు. అలాంటివారికి నీళ్లల్లో నిమ్మరసం, అల్లం కలిపి ఇవ్వడం వల్ల ఆకలి పెరుగుతుంది.

అల్లం జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకం సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అదనపు కొవ్వును కరిగించి బరువు తగ్గడంలో సహాయపడుతుందే కాకుండా, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జలుబు, దగ్గు, తలనొప్పి, మైగ్రేన్, నడుంనొప్పి, వెన్నుపూస నొప్పి, మోకాలి నొప్పులు, జాయింట్ పెయిన్స్ వంటి సమస్యలను తగ్గించడానికి అల్లం బాగా పనిచేస్తుంది. ఇందులో నొప్పి, వాపును తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. రోజుకు 2 నుంచి 5 గ్రాముల అల్లంను రెండు వారాల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అల్లం రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేసి, జుట్టును బలంగా, ఒత్తుగా ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో కూడా ఇది ఎంతో సహాయపడుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచే ఈ సహజ ఔషధాన్ని మీ రోజువారీ జీవనశైలిలో చేర్చుకోవడం మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి డయాబెటిక్ రోగులకు మేలు చేస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో అల్లం తినడం లేదా అల్లం నీరు తాగడం శరీర డిటాక్స్‌కు సహాయపడుతుంది. ఒక నెలపాటు ప్రతిరోజూ అల్లం తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అల్లంలోని పదార్థాల వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్‌ల పరిమాణం తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
వచ్చే ఏడాది వెండి ధర రూ. 5 లక్షల మార్కును దాటనుంది? బంగారం ధర ఎంత
వచ్చే ఏడాది వెండి ధర రూ. 5 లక్షల మార్కును దాటనుంది? బంగారం ధర ఎంత
రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కివీస్‌లోనే కెరీర్ క్లోజ్..!
రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కివీస్‌లోనే కెరీర్ క్లోజ్..!
సర్పంచ్ పదవికి కోసం కుమ్మరిస్తున్న ఆశావాహులు!
సర్పంచ్ పదవికి కోసం కుమ్మరిస్తున్న ఆశావాహులు!
గోల్డ్ ETFsలోకి పెట్టుబడుల వరద.. ఎన్ని కోట్లు ఇన్వెస్ట్ చేశారంటే?
గోల్డ్ ETFsలోకి పెట్టుబడుల వరద.. ఎన్ని కోట్లు ఇన్వెస్ట్ చేశారంటే?
ఆ స్టార్ హీరోను ఇమిటేట్ చేశా.. ఆయన చేసిన పనికి ఆశ్చర్యపోయా..
ఆ స్టార్ హీరోను ఇమిటేట్ చేశా.. ఆయన చేసిన పనికి ఆశ్చర్యపోయా..
ఫుడ్ బిజినెస్‌లో దంపతుల అదృష్టం.. 9 నెలల్లోనే రూ.56 లక్షల ఆదాయం!
ఫుడ్ బిజినెస్‌లో దంపతుల అదృష్టం.. 9 నెలల్లోనే రూ.56 లక్షల ఆదాయం!
వచ్చేస్తున్నార్రోయ్.. బుడ్డోడిని మించిన 5గురు దేశీయ తోపులు..!
వచ్చేస్తున్నార్రోయ్.. బుడ్డోడిని మించిన 5గురు దేశీయ తోపులు..!
గ్యాంగ్రీన్ ఎలా ముప్పుగా మారుతుంది?
గ్యాంగ్రీన్ ఎలా ముప్పుగా మారుతుంది?
యువకుడి జుట్టు పట్టుకుని పొట్టు పొట్టుగా కొట్టిన యువతి..!
యువకుడి జుట్టు పట్టుకుని పొట్టు పొట్టుగా కొట్టిన యువతి..!
4వ వన్డేలో విఫలం.. కట్‌చేస్తే.. టీమిండియా టెస్ట్ టీం నుంచి ఔట్..!
4వ వన్డేలో విఫలం.. కట్‌చేస్తే.. టీమిండియా టెస్ట్ టీం నుంచి ఔట్..!
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో