బొప్పాయి పండు మాత్రమే కాదు.. గింజలు కూడా అమృతమే..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

|

Sep 12, 2023 | 4:50 PM

ఆరోగ్యానికి మంచి ఔషధనిధి.. బొప్పాయి..ఈ పండులో విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. బొప్పాయి పండులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి తగు మోతాదులో లభిస్తాయి. బొప్పాయిలో ఉండే కెరోటిన్, ఖనిజాలు, ఫ్లేవనాయిడ్లు, ఫోలేట్లు, పాంథోనిక్ ఆమ్లాలు మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు లభిస్తాయి. బొప్పాయి పండులాగే.. గింజలు కూడా..

బొప్పాయి పండు మాత్రమే కాదు.. గింజలు కూడా అమృతమే..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
రోజుకు 1 టేబుల్ స్పూన్ (15 గ్రాములు) బొప్పాయి గింజలను తీసుకోవాలి. అప్పుడే మీరు ఈ ప్రయోజనాలన్నింటినీ పొందగలరు.
Follow us on

బొప్పాయి గింజల ప్రయోజనాలు : ఆయుర్వేదం ప్రకారం బొప్పాయి పండు మాత్రమే కాకుండా బొప్పాయి గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బొప్పాయి అనేది.. వేడిని ఉత్పత్తి చేసే పండు. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సాధారణంగా మనం బొప్పాయి పండును పొట్టు తీసి తింటాం. అందులోని విత్తనాలను చెత్తగా పారేస్తాం. కానీ, జ్యుసి బొప్పాయి పండ్ల విత్తనాలు కూడా అనేక అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయని మీకు తెలుసా..? అవును ఇది నిజమే.. బొప్పాయి గింజలతో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది..

ఆరోగ్యానికి మంచి ఔషధనిధి.. బొప్పాయి..ఈ పండులో విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. బొప్పాయి పండులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి తగు మోతాదులో లభిస్తాయి. బొప్పాయిలో ఉండే కెరోటిన్, ఖనిజాలు, ఫ్లేవనాయిడ్లు, ఫోలేట్లు, పాంథోనిక్ ఆమ్లాలు మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు లభిస్తాయి. బొప్పాయి పండ్లలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆహార ప్రోటీన్లు, కొవ్వుల జీర్ణక్రియలో సహాయపడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఎంజైమాటిక్ ప్రభావం మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ నియంత్రణ..

ఫైబర్ పుష్కలంగా ఉండే బొప్పాయి పండ్ల గింజలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల పేగుల్లోని కొలెస్ట్రాల్ శోషణను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. ఫలితంగా ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.

కాలేయ నిర్విషీకరణ..

బొప్పాయి గింజలు కాలేయ ఆరోగ్యానికి తోడ్పడే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. బొప్పాయి గింజలలోని కొన్ని సమ్మేళనాలు కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

గుండె ఆరోగ్యం..

బొప్పాయి పండ్ల విత్తనాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుండెకు సంబంధించిన అనారోగ్య సమస్యలు దరిచేరకుండా రక్షిస్తుంది.

పవర్‌హౌస్..

బొప్పాయి పండ్ల గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫినాలిక్, ఫ్లేవనాయిడ్ సమ్మేళనాలను కూడా కలిగి ఉంటుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా, ఈ విత్తనాలు వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

యాంటీ బాక్టీరియల్ లక్షణాలు..

బొప్పాయి గింజలు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని వివిధ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతాయి.

జీర్ణవ్యవస్థ..

బొప్పాయి పండ్ల గింజల్లో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది ఆహారంలో ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ఉబ్బరం, మలబద్ధకం, అజీర్ణం వంటి లక్షణాలను తగ్గిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..