కావాల్సిన పదార్ధాలు
ఉల్లిపాలు -3
తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొన్ని
కొత్తిమీర
పచ్చి మిర్చి -10
నూనె
జీలకర్ర- ఒక టీ స్పూన్
మెంతులు- కొంచెం
ఉప్పు- రుచికి సరిపడా
వెల్లుల్లి రెమ్మలు
చింత పండు- కొంచెం
తాళింపుకి కావల్సిన దినుసులు
కరివేపాకు
వెల్లుల్లి
ఎండుమిర్చి
జీలకర్ర
మినపప్పు
శనగపప్పు
ఇంగువ -కొంచెం
తయారీ విధానం: పొట్టు తీసిన ఉల్లిపాలను స్విమ్ లో పెట్టిన మంటపై కాల్చుకోవాలి. తర్వాత ఒక బాణలి తీసుకుని అందులో కొంచెం నూనె వేసుకుని వేడి ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న పచ్చి మిర్చి వేసుకుని వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర, మెంతులు, కొంచెం చింత పండు వేసుకుని వేయించాలి. తర్వాత పక్కన పెట్టుకుని కాల్చిన ఉల్లిపాయ పై పోర తీసి.. ముక్కలు గా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ తీసుకుని అందుకో వేయించిన పచ్చి మిర్చి, మెంతులు, జీలకర్ర , చింత పండు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లి వేసుకుని కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ ఉల్లిపాయ చెట్నీ లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద బాణలి పెట్టి.. కొంచెం నూనె వేసుకుని వేడి ఎక్కిన తర్వాత పోపు దినుసులు.. కరివేపాకు ,వెల్లుల్లి ,ఎండుమిర్చి ,జీలకర్ర,మినపప్పు ,శనగపప్పు ,ఇంగువ వేసుకుని వేయించి ఈ పోపుని ఉల్లిపాయ పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి. అంతే టేస్టీగా ఈజీగా ఉల్లిపాయ పచ్చడి రెడీ.. ఇది ఉల్లిపాయ పచ్చడిని, నెయ్యిని వేసుకుని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతేకాదు ఇడ్లి, దోసె వంటి టిఫిన్స్ లోకి కూడా బాగుంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..