Navarathri 7th Day Naivedyam: రేపు దుర్గాదేవిగా అమ్మవారు దర్శనం.. కదంబం ప్రసాదం నైవేద్యం.. తయారీ …

|

Oct 12, 2021 | 2:49 PM

Devi Navarathri 7th Day Naivedyam: దేవి నవరాత్రుల్లో రేపు ఏడో రోజు. శక్తి స్వరూపిణి అమ్మవారిని దుర్గాదేవిగా కొలుస్తారు. ఈరోజుని దుర్గాష్టమిని.. మహాష్టమి లేక...

Navarathri 7th Day Naivedyam: రేపు దుర్గాదేవిగా అమ్మవారు దర్శనం.. కదంబం ప్రసాదం నైవేద్యం.. తయారీ ...
Navaratri 7th Day
Follow us on

Devi Navarathri 7th Day Naivedyam: దేవి నవరాత్రుల్లో రేపు ఏడో రోజు. శక్తి స్వరూపిణి అమ్మవారిని దుర్గాదేవిగా కొలుస్తారు. ఈరోజుని దుర్గాష్టమిని.. మహాష్టమి లేక వీరాష్టమి అని కూడా అంటారు. కొన్ని చోట్ల అష్టమి రోజున మహాభగళ, నారాయణిదేవిని కూడా పూజిస్తారు. దుర్గాదేవిని పూజించే భక్తులు అమ్మవారికి నైవేద్యంగా కదంబం ప్రసాదాన్ని నివేదిస్తారు. కదంబం ప్రసాదం తయారీ విధానం తెలుసుకుందాం..

కావలసిన పదార్ధాలు: 

బియ్యం-అర కప్పు( కొత్తబియ్యం)
కందిపప్పు-అర కప్పు కప్
వంకాయ 1
బంగాళదుంప1
టోమాటో 2
సొర్రకాయ చిన్న ముక్క
దోసకాయ 1
బీన్స్ తగినన్ని
వేరుశనగ గుళ్లు పావు కప్పు
మొక్కజొన్న గింజలు పావు కప్పు
క్యారెట్
కరివేపాకు
కొత్తమీర
పచ్చి కొబ్బరి కోరు పావు కప్పు
పచ్చి మిర్చి 4
నూనె తగినంత
నెయ్యి చిన్న కప్పు
చింతపండు గొజ్జు తగినంత
బెల్లం తురిమింది కొంచెం
ఉప్పు రుచికి సరిపడా..
పసుపు కొంచెం
సాంబరు పొడి 3 స్పూన్స్
పోపు గింజలు
ఎండుమిర్చి
ఇంగువ

తయారీవిధానం: కదంబ ప్రసాదం తయారీకి ముందుగా తీసుకున్న కూరగాయలను కావాల్సిన సైజులో కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.  అనంతరం స్టౌ మీద కుక్కర్ పెట్టి.. కంది పప్పు వేసుకుని కొంచెం దోరగా వేయించుకోవాలి.. దానిలో బియ్యం వేసి.. కడిగి శుభ్రం చేసుకోవాలి. అనంతరం ఆ బియ్యం కందిపప్పుతో కట్ చేసుకున్న కూరగాయ ముక్కల్నీ వేసుకోవాలి. టమాటా ముక్కలను మాత్రం పక్కకు పెట్టుకోవాలి. అందులోనే కొంచెం పసుపు, తగినంత ఉప్పు, 5 పావులు నీరు వేసుకుని కుక్కర్ రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి.

తర్వాత స్టౌ మీద బాణలి పెట్టి అందులో కొంచెం నూనె వేసుకుని ఆవాలు పచ్చిమిర్చి నిలువా చీల్చినవి కరివేపాకు, టమాటో ముక్కలు, చింతపండు గుజ్జు, సాంబార్ పౌడర్, బెల్లం ముక్క వేసుకుని ఉడికించాలి… ఈ మిశ్రమం గ్రేవీగా అయ్యే వరకూ ఉడికించి అందులో కట్ చేసుకున్న కొత్తిమీద కర్వేపాకు, కొంచెం నెయ్యి వేసి మరోసారి ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత ఎండుమిర్చి, ఇంగువ తాలింపు వేసుకుని చివరిగా కొబ్బరి కోరు కలిసి.. ఒక్కసారి వేడి చేసి దించేయండి. అంతే అమ్మవారి నైవేద్యం కోసం ఘుమఘుమలాడే కదంబ ప్రసాదం రెడీ.. ఆ దుర్గాదేవికి నైవేద్యంగా పెట్టి.. అమ్మవారి దీవెనలు అందుకోండి.

Also Read:ఈ 3 రాశుల వారు తియ్యగా మాట్లాడుతారు..! కానీ పర్యవసనం వేరుగా ఉంటుంది..

దుర్గమ్మ గుడిలో పాము ప్రత్యక్షం.. పూజ పూర్తయ్యే వరకు అమ్మవారినే చూస్తూ..