మార్నింగ్ అలర్ట్.. పరగడుపున వీటిని తింటున్నారా..? డేంజర్‌లో పడతారు జాగ్రత్త..

|

Jan 02, 2025 | 8:59 AM

ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.. అందుకే.. ప్రతి ఆహారాన్ని తినడానికి సరైన మార్గం.. సరైన సమయం కూడా ఉంది. అటువంటి పరిస్థితిలో ఖాళీ కడుపుతో కొన్ని పదార్థాలను ఎప్పుడూ తినకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొవలసి వస్తుందని పేర్కొంటున్నారు. అవేంటో తెలుసుకోండి..

మార్నింగ్ అలర్ట్.. పరగడుపున వీటిని తింటున్నారా..? డేంజర్‌లో పడతారు జాగ్రత్త..
Morning Breakfast
Follow us on

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మంచి జీవనశైలిని అవలంభించడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.. దీనికోసం ఉదయం నుంచే రోజును ప్లాన్ చేసుకోవాలి.. వాస్తవానికి రోజు మొదటి భోజనం.. అంటే అల్పాహారం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇది మీ ఆరోగ్యాన్ని తయారు చేయడంలో లేదా విచ్ఛిన్నం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే మీరు రోజంతా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.. అయితే.. దీనిలో ఏం తింటామన్నది కూడా ముఖ్యం.. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు మీరు మొదట ఏమి తింటారు లేదా ఏం తాగుతారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

పూర్తి శక్తితో పనిచేయడానికి శరీరానికి వేడెక్కడం అవసరం. దీని కోసం తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. అటువంటి పరిస్థితిలో, చాలా మంది ఉదయం అల్పాహారంగా కొన్ని తినకూడని పదార్థాలు తింటారు.. ఇవి డైలీ లైఫ్ పై ప్రభావం చూపుతాయి.. ఉదయాన్నే అల్పాహారంగా ఎలాంటి పదార్థాలు తినకూడదో ఇప్పుడు తెలుసుకోండి..

అరటిపండు: అరటి పండు పోషకాలతో కూడిన పండు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దీన్ని ఖాళీ కడుపుతో తినే తప్పు చేయకూడదు. దీనికి కారణం ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెర.. ఇది ఖాళీ కడుపుతో తింటే శరీరంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.

వేయించిన ఆహారాలు: ఉదయాన్నే పూరీ లేదా స్నాక్స్, ఇంకా ఏదైనా వేయించిన ఆహారాలు తినడం వల్ల రోజంతా కడుపు నిండిన అనుభూతిని పొందవచ్చు. ఇందులో అధిక మొత్తంలో నూనె, కొవ్వు ఉండటం వల్ల కడుపు బరువుగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో, ఖాళీ కడుపుతో దీనిని తీసుకోవడం వల్ల అజీర్ణం, నీరసంగా అనిపించవచ్చు.

సిట్రస్ పండ్లు: ఖాళీ కడుపుతో పుల్లటి పండ్లు లేదా రసం తీసుకోవడం కూడా ఆరోగ్యకరం కాదు. పుల్లటి జ్యూస్‌లతో రోజును ప్రారంభించడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, అసౌకర్యం, గుండెల్లో మంట వంటివి ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో, ఇది అల్సర్లకు కారణమవుతుంది.

స్పైసీ ఫుడ్స్: ఉదయం భోజనంలో మిర్చి, మసాలాలతో కూడా స్పైసీ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల పొట్ట లైనింగ్‌లో చికాకు కలుగుతుంది. దీనితో పాటు, ఖాళీ కడుపుతో స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అజీర్ణం లేదా గుండెల్లో మంట వస్తుంది.

సలాడ్: మీరు పచ్చి కూరగాయలతో తయారుచేసిన సలాడ్‌ను ఖాళీ కడుపుతో తీసుకుంటే, మీరు దుష్ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది సాధారణంగా కడుపు నొప్పిని కలిగిస్తుంది. ఎందుకంటే వాటిని జీర్ణం చేయడం కష్టతరమవుతుంది.

కాఫీ – టీ: ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది.. కొంతమందికి అసౌకర్యం కలుగుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..