Weight Loss: వర్షాకాలంలో బరువు తగ్గాలనుకుంటున్నారా..! ఈ 4 ఆహారాలు ట్రై చేయండి..

|

Aug 05, 2021 | 9:38 PM

Weight Loss: వర్షకాలంలో సీజనల్‌ వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గాలిలోని తేమ కారణంగా హానికరమైన సూక్ష్మజీవుల పెరుగుదల అధికంగా ఉంటుంది. దీంతో చాలా మంది మసాలా,

Weight Loss: వర్షాకాలంలో బరువు తగ్గాలనుకుంటున్నారా..! ఈ 4 ఆహారాలు ట్రై చేయండి..
Ginger Turmeric
Follow us on

Weight Loss: వర్షకాలంలో సీజనల్‌ వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గాలిలోని తేమ కారణంగా హానికరమైన సూక్ష్మజీవుల పెరుగుదల అధికంగా ఉంటుంది. దీంతో చాలా మంది మసాలా, వేయించిన ఆహారం కోసం ఆరాటపడుతారు. ఇది ప్రమాదకరమైనది మాత్రమే కాదు అనారోగ్యకరమైనది కూడా. మీ బరువును విపరీతంగా పెంచుతుంది. వర్షాకాలంలో అనారోగ్యం బారిన పడకుండా, అదనపు బరువు పెరగకుండా ఉండటానికి తేలికపాటి ఆహారం తీసుకోవడం ముఖ్యం. అందుకోసం ఈ 4 ఆహారాలు చక్కగా పనిచేస్తాయి.

1. సూప్
వర్షకాలంలో చాట్, పకోడాలు తినడానికి బదులుగా అల్పాహారంలో సూప్ తీసుకోండి. ఇది మీ ఆకలిని తీర్చడమే కాకుండా మీ శరీర అవసరాలను కూడా తీరుస్తాయి. ఇది జీర్ణించుకోవడం సులభం. అల్లం, వెల్లుల్లి, నల్ల మిరియాలతో సూప్ తీసుకోవడం మంచిది. రుచిని పెంచడమే కాకుండా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన ఆహారం కూడా.

2. ఉడికించిన కూరగాయలు
ఉడికించిన కూరగాయలలో చాలా పోషకాలు ఉంటాయి. సూక్ష్మక్రిములను తొలగిపోతాయి. రుచి కొత్తగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా డైట్ నిపుణులు, ఆరోగ్య నిపుణులు బ్రోకలీ, పుట్టగొడుగులు, క్యారెట్లు, టమోటాలు ఉడికించి తినాలని సిఫార్స్ చేస్తారు.

3. అల్లం
అల్లం ఒక అద్భుత మసాలా. అల్లం టీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది క్రోమియం, మెగ్నీషియం, జింక్ గొప్ప మూలం. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. జలుబు, ఫ్లూతో పోరాడటానికి సహాయపడతాయి.

4. పసుపు
పసుపు రోగనిరోధక శక్తిని పెంచడంలో చక్కగా పనిచేస్తుంది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి తోడ్పడుతుంది. ఒక టీస్పూన్ పసుపు పొడిని ఒక కప్పు పాలలో కలుపుకొని తాగితే చాలా మంచిది. వర్షాకాలంలో చాలా వ్యాధులను నివారించవచ్చు.

RITES Recruitment: రైట్స్‌ లిమిటెడ్‌లో ఇంజనీర్‌ ఉద్యోగాలు.. అర్హులెవరు? ఎలా అప్లై చేసుకోవాలంటే..

దంపతుల మధ్య ఏజ్‌ గ్యాప్ ఉంటే ఈ 4 సమస్యలు..! అవేంటో తెలుసుకోండి..

Guava : ఈ 3 వ్యాధులు ఉన్నవారు జామపండు అస్సలు తినకూడదు..! ఎందుకో తెలుసుకోండి..