Banana Flower: అరటి పువ్వులో అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. అరటి పువ్వులో భాస్వరం, కాల్షియం, పొటాషియం, రాగి, మెగ్నీషియం, ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలతో నిండి ఉంటాయి. వీటిని సలాడ్లు, సూప్‌లు, సాధారణ ఆహారంలో చేర్చవచ్చు. అరటి పువ్వు ప్రయోజనాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.
అరటి పువ్వు ప్రయోజనాలు
1. అరటి పువ్వు శరీరంలో ఇన్ఫెక్షన్ నివారిస్తుంది. ఇందులో ఇథనాల్ ఉంటుంది. ఇది వ్యాధికారక బాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది.
2. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. జర్నల్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. అరటి పువ్వు సారం గ్లూకోజ్‌ను పెంచుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
3. అరటి పువ్వులో మెగ్నీషియం ఉంటుంది ఇది ఆందోళనను తగ్గిస్తుంది. మనస్సును సంతోషంగా ఉంచడంలో సహాయపడుతుంది. అరటి పువ్వు డిప్రెషన్‌లో సహజంగా పనిచేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. దీనిని మనం యాంటీ డిప్రెసెంట్ అని కూడా అనవచ్చు.
4. క్యాన్సర్, గుండె జబ్బుల నివారణలో తోడ్పడుతుంది. అరటి పువ్వులలో ఫినోలిక్ ఆమ్లాలు, టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, అనేక ఇతర యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఆక్సీకరణ నష్టాన్ని నివారిస్తాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
5. అరటి పువ్వులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అరటి పువ్వు కణాలపై ఒత్తిడిని తగ్గిస్తాయి వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తాయి.
6. అరటి పువ్వులో ఉండే అనేక పోషకాలు మూత్రపిండాల ఆరోగ్యకరమైన పనితీరును ప్రేరేపిస్తాయి. అంతేకాదు మూత్రపిండాల్లో రాళ్లను తొలగించి ఉబ్బరం, మూత్ర సమస్యల ప్రమాదాన్ని నివారిస్తుంది.
7. అరటి పువ్వులలో ఐరన్ సమృద్ధిగా దొరుకుతుంది. తద్వారా రక్తహీనత నుంచి ఉపశమనం పొందవచ్చు. అరటి పువ్వును రెగ్యులర్‌గా ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎర్ర రక్త కణాల స్థాయి పెరుగుతుంది.