సాధారణంగా మనం డిఫరెంట్ రుచులను ఆశ్వాదించడానికి రెస్టారెంట్ కు వెళ్తుంటాం. ఎప్పుడూ ఇంటి ఫుడ్ తిని బోర్ కొట్టి రెస్టారెంట్ లో వివిధ కొత్త వంటకాలను ట్రై చేయాలనుకుంటాం. అలాగే విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ సాంప్రదాయ వంటను ట్రై చేయాలని అనుకుంటాం. అయితే వాటి పేరు తెలియక ఇబ్బంది పడుతుంటాం. ఒక్కోసారి ఏదైతే అది అయ్యిందని ఆర్డర్ చేసేస్తాం. వాడు మనకు తెలిసిన వంటకమే పేరు మార్చి ఇచ్చేశాడు అని ఫీలవుతుంటాం. సరిగ్గా ఇలాగే మలేసియాలోని ఓ రెస్టారెంట్ చేసింది. ఆసియన్ నాచోస్ పేరుతో అప్పడాలను అమ్మేస్తుంది. ఆ విషయాలేంటో చూద్దాం
సాధారణంగా మన ఇంట్లో పప్పు, సాంబార్ వంటి వంటకాల్లో అప్పడం లేకపోతే ఏదో చిన్న వెలితిగా అనిపిస్తుంటుంది. భారతదేశంలోని ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి చోటా అప్పడాలను ఇష్టపడుతుంటారు. సరిగ్గా ఈ డిమాండ్ నే క్యాచ్ చేసిన ఓ మలేసియన్ రెస్టారెంట్ అప్పడాలను పేరు మార్చి అమ్మేస్తుంది. పేరు మార్చి అమ్మితే పర్లేదు ఏకంగా ఐదు అప్పడాలను ఐదు వందలకు అమ్మడంతో సోషల్ మీడియాలోనే యూజర్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. మలేషియన్ రెస్టారెంట్ లో ఏసియన్ నాచోస్ పేరుతో 27 మలేషియన్ రింగేట్స్ కు అమ్మేస్తున్నారా? అంటూ ఆశ్ఛర్యం వ్యక్తం చేస్తున్నారు. సమంత అనే అమ్మాయి ఈ ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేయగా చాలా మంది ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. రూ.2 కే అప్పడంతో సంతృప్తి చెందుతామని వాటి ధర రూ.500 ఎందుకు? అని ఒకరు? ఏకంగా 200 శాతం లాభసాటి బిజినెస్ అని మరొకరు ఇలా చాలా ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.