చలికాలంలో నువ్వుల లడ్డూలు కచ్చితంగా తినాలి..! ఆ సమస్యలకు చక్కటి పరిష్కారం..

|

Nov 18, 2021 | 6:04 AM

Nuvvula Laddu: చలికాలంలో నువ్వుల లడ్డూలను ఎక్కువగా తింటారు. ఇందులో శరీరానికి కావలసిన పోషకాలు అన్నీ ఉంటాయి. వీటిని తయారు చేయడం

చలికాలంలో నువ్వుల లడ్డూలు కచ్చితంగా తినాలి..! ఆ సమస్యలకు చక్కటి పరిష్కారం..
Nuvvula
Follow us on

Nuvvula Laddu: చలికాలంలో నువ్వుల లడ్డూలను ఎక్కువగా తింటారు. ఇందులో శరీరానికి కావలసిన పోషకాలు అన్నీ ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. బెల్లం, వేరుశెనగతో తయారు చేస్తారు. అంతేకాదు బెల్లం స్వీట్లకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. అతిథులకు అందించడానికి మంచి వంటకం. ఏదైనా ప్రత్యేక సందర్భాలలో కూడా వీటిని తయారు చేయవచ్చు. నువ్వులలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఈ చిన్న విత్తనాలు ప్రోటీన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్ల అద్భుతమైన మూలం. ఇవి మీ చర్మం, ఎముకలు, జుట్టుకు చాలా మంచిది. నువ్వులలో ఎముకలను ధృడంగా ఉంచే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కాలేయం, చర్మానికి కూడా మేలు చేస్తాయి. నువ్వులలో ముఖ్యంగా కాల్షియం, ఫాస్పరస్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజాలు కొత్త ఎముకలను నిర్మించడానికి, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. వీటిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

నువ్వుల లడ్డుకి కావలసినవి
1. నువ్వులు – 200 గ్రాములు
2. నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు
3. పచ్చి శనగపప్పు – 50 గ్రాములు
4. తరిగిన బెల్లం – 300 గ్రాములు

ఎలా తయారు చేయాలి
1. బాణలిలో నువ్వులు వేసి వేయించాలి. వాటిని ఒక ట్రేలో తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. అలాగే అదే బాణలిలో శనగలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వాటిని మరో ట్రేలో తీసుకుని చల్లారనివ్వాలి. తర్వాత శనగలను మెత్తగా రుబ్బాలి. ఇప్పుడు అదే పాన్‌లో తక్కువ మంట మీద నెయ్యి వేసి కరిగించాలి. అందులో బెల్లం వేసి కలపాలి. మంట మీద నుంచి తొలగించి 3 నిమిషాలు పక్కన పెట్టాలి. అందులో నువ్వులు, వేయించిన శనగపిండి వేసి గరిటెతో బాగా కలపాలి.పైన పేర్కొన్న పేస్ట్‌ను వేరే ప్లేట్‌లో తీసి 5 నిమిషాలు చల్లార్చాలి. ఇప్పుడు ఆ పేస్ట్‌ని ఒక్కొక్కటిగా లడ్డూల ఆకారంలో రోల్ చేయాలి. అంతే నువ్వుల లడ్డూలు సిద్దం.

విటమిన్‌ ‘E’ లేకుంటే శరీరంలో ఈ రెండు పనిచేయవు..! అందుకే ఈ 5 ఆహారాలు తప్పనిసరి..

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన 6 ఏళ్ల బాలిక.. ఏ విషయంలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

IND vs NZ: ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం