అమ్మ బాబోయ్.. నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..

|

Nov 02, 2024 | 5:40 PM

నిమ్మకాయలో విటమిన్ సి వంటి అనేక పోషకాలు ఉన్నాయి. కానీ అధికంగా తీసుకోవడం వల్ల దంత సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు, చర్మ సమస్యలు, బరువు పెరుగుదల వంటి దుష్ప్రభావాలు ఉంటాయి. నిమ్మకాయ సరైన మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యం.

అమ్మ బాబోయ్.. నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
Lemon
Follow us on

నిమ్మకాయలో అనేక పోషకాలు, ఔషధ గుణాలు దాగున్నాయి. పుల్లటి రుచితో ఉండే ఈ నిమ్మకాయ రసాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే.. నిమ్మకాయను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.. దీనిని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరుతాయి.. విటమిన్ సీ తోపాటు.. అనే పోషకాలున్న నిమ్మకాయను సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. విటమిన్ సి అవసరాలను తీర్చడానికి నిమ్మకాయను ఉపయోగిస్తారు.. ఇది రోగనిరోధక శక్తిని పెంచే పోషకం.. దీంతో మీరు జలుబు, దగ్గు, ఫ్లూ, జ్వరం వంటి వైరల్ వ్యాధులను నివారించవచ్చు. అయితే.. నిమ్మకాయ తీసుకోవడం చాలామంచిదే, కానీ మీరు నిమ్మకాయను పరిమితికి మించి తీసుకుంటే శరీరానికి మేలు బదులు చెడు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల, నిమ్మకాయ ప్రతికూల ప్రభావాలేంటో తెలుసుకోవడం ఉత్తమం.. నిమ్మకాయ లేదా నిమ్మ రసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకోండి.

నిమ్మకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు

దంత సమస్యలు: నిమ్మకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల దంత సమస్యలు వస్తాయి. నిమ్మకాయ ఆమ్ల స్వభావం దంతాల ఎనామెల్ దెబ్బతినడం, సున్నితత్వం పెరగడం వంటి దంత నష్టాన్ని కలిగిస్తుంది.

కడుపు సంబంధిత సమస్యలు: నిమ్మరసం జీర్ణక్రియకు ఉత్తమమైనదిగా పరిగణించినప్పటికీ.. మీరు నిమ్మకాయను ఎక్కువగా తీసుకుంటే గ్యాస్, ఉబ్బరం, ఆమ్లత్వం వంటి కడుపు సంబంధిత సమస్యలు పెరుగుతాయి.

చర్మ సమస్యలు: నిమ్మకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం మొద్దుబారడంతోపాటు పొడిబారుతుంది.. ఇది చర్మాన్ని అసౌకర్యానికి గురి చేస్తుంది. ఇది సూర్యకాంతి, UV రేడియేషన్‌ను తట్టుకోగల చర్మం సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

బరువు పెరిగే ప్రమాదం: నిమ్మకాయను పరిమిత పరిమాణంలో తీసుకుంటే.. అది బరువును తగ్గిస్తుంది. కానీ ఎక్కువ నిమ్మకాయను తీసుకోవడం వల్ల ఎక్కువ ఆహారం తినాలనే కోరిక పెరుగుతుంది. మీరు ఎక్కువ ఆహారం తీసుకుంటే, మీ బరువు క్రమంగా పెరుగుతుంది.

నొప్పి – వాపు: నిమ్మకాయను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు విటమిన్ సి ఏర్పడుతుంది. ఇది కీళ్లలో నొప్పి-వాపును పెంచుతుంది. కాబట్టి, నిమ్మకాయను పరిమితుల్లో మాత్రమే తీసుకోవాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి