Health Tips: పూర్వ కాలంలో ప్రజలు తమ రోజును బాదంతో ప్రారంభించేవారు. ఆహారంలో నట్స్ తప్పనిసరిగా చేర్చేవారు. అల్పాహారంలో పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే రోజు మొత్తం ఎనర్జిటిక్‌గా ఉండవచ్చు. అంతేకాదు పలు రోగాల నుంచి తప్పించుకోవచ్చు. బాదంపప్పు, వాల్‌నట్స్‌లో ప్రోటీన్లు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. అందుకే వీటిని నానబెట్టి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.
బాదం ప్రయోజనాలు
నానబెట్టిన బాదం, వాల్‌నట్‌లతో రోజు ప్రారంభించడం ఆరోగ్యానికి చాలా మంచిది. హార్మోన్లు ఉత్తమంగా పని చేయడానికి ఇవి దోహదం చేస్తాయి. వ్యాయామం చేశాక ఇవి తీసుకుంటే శరీరానికి తగిన పోషకాలు అందుతాయి. ఈ గింజలను ఎల్లప్పుడూ రాత్రి 8 నుంచి 10 గంటలలోపు నానబెట్టాలి. అప్పుడే అందులో మంచి పోషకాలు వృద్ధి చెందుతాయి. బాదంను ప్రోటీన్ పవర్ హౌస్ అంటారు. ఇందులో విటమిన్ ఇ, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
నానబెట్టిన వాల్‌నట్ వల్ల ప్రయోజనాలు
వాల్‌నట్స్‌లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఈ, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి. వాల్‌నట్‌లను బ్రెయిన్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది కాకుండా వాల్నట్‌లో కాల్షియం, పొటాషియం, ఐరన్, జింక్ అధిక మొత్తంలో ఉంటాయి. రోజూ నానబెట్టిన వాల్‌నట్ తినడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది కాకుండా రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.