AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవిలో రోజు పెరుగన్నం తింటున్నారా.? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!

ఇక మరికొందరు మజ్జిగ తాగుతారు. అయితే వేసవిలో పెరుగు తిపడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిఫుణులు చెబుతున్నారు. పెరుగులో శరీరానికి అవసరమైన క్యాల్షియంతో పాటు ఫాస్ఫరస్ కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా పెరుగన్నం తినడం వల్ల ఎముకల సమస్యలతో పాటు దంతాల సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు.

వేసవిలో రోజు పెరుగన్నం తింటున్నారా.? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!
Curd Rice
Jyothi Gadda
|

Updated on: Apr 23, 2025 | 7:34 PM

Share

పెరుగు అంటే దాదాపు అందరికీ ఇష్టమే. చాలా మంది పెరుగన్నం తింటేనే భోజనం చేసినట్టుగా ఫీల్ అవుతుంటారు.  ఎన్ని రకాల వంటకాలు ఉన్నప్పటికీ చివర్లో పెరుగన్నం తింటేనే సంతృప్తి కలుగుతుంది అనేవారు ఎక్కువగా ఉంటారు. ఇక మరికొందరు మజ్జిగ తాగుతారు. అయితే వేసవిలో పెరుగు తిపడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిఫుణులు చెబుతున్నారు. పెరుగులో శరీరానికి అవసరమైన క్యాల్షియంతో పాటు ఫాస్ఫరస్ కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా పెరుగన్నం తినడం వల్ల ఎముకల సమస్యలతో పాటు దంతాల సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు.

వేసవిలో పెరుగన్నం తినటం వల్ల శరీరానికి చలువ చేస్తుంది.  పెరుగులో లభించే విటమిన్ బి12 నాడీ వ్యవస్థను కూడా మెరుగుపరిచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఇందులో విటమిన్ b2 కూడా ఉంటుంది ఇది శరీరంలోని శక్తిని ఉత్పత్తి చేసేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.  రోజు సాయంత్రం పూట పెరుగన్నం తింటే శరీరానికి విటమిన్ బి3 తోపాటు పొటాషియం, మెగ్నీషియం లభించి కండరాలు దృఢంగా తయారవుతాయి. పెరుగన్నం రోజు తింటే శరీరం కూడా స్ట్రాంగ్ అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు, పొట్ట సమస్యలు కూడా రాకుండా ఉంటాయని చెబుతున్నారు.

అయితే, పెరుగన్న తయారీ కోసం తీసుకోవాల్సిన పదార్థాలు..  పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు, తగినంత నూనె, ఉప్పు అవసరం. పెరుగన్నం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వండుకున్న అన్నాన్ని వేసి సరిపడా పెరుగును వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని స్టవ్ పై పెట్టుకొని అందులో తగినంత నూనె వేసి వేడెక్కిన తర్వాత పోపుదినుసులు, చిన్నగా తరిమి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత అందులోనే తగినంత అల్లం ముక్కలు, ఉప్పు వేసుకుని వేపుకొని పెరుగన్నం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, కమ్మటి పెరుగన్నం తినేందుకు తయారైనట్టే.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి