Health Tips: రాగులు సూపర్‌ఫుడ్. రాత్రి పడుకునే ముందు పాలలో రాగిజావ కలుపుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు అనేక వ్యాధులను నివారించవచ్చు. దేశంలో చాలా ప్రాంతాల్లో రాగులను ఆహారంగా తీసుకుంటారు. ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో రాగితో తయారు చేసిన పదార్థాలను సూపర్‌ఫుడ్‌గా పిలుస్తారు. ఇది జీవక్రియను పెంచుతుంది, గుండె జబ్బులను నివారిస్తుంది. బరువు తగ్గిస్తుంది. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. రాగిలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కొవ్వు, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, బి, ఈ మినరల్స్ ఉండవు. అయితే థయామిన్, రిబోఫ్లేవిన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్ ఉంటాయి. ఇవి మీ రోజు ప్రారంభానికి చక్కగా ఉపయోగపడతాయి.
రాత్రిపూట రాగితో తయారుచేసిన వస్తువులను తినవద్దు..
రాగిలో ప్రోటీన్, కాంప్లెక్స్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను నెమ్మదిగా చేసేలా చూస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రిపూట రాగితో తయారు చేసిన పదార్థాలను తినడం మానుకోవాలి. పగటిపూట జీర్ణశయాంతర ప్రేగు నుంచి యాసిడ్ విడుదలవుతుంది. ఇది రాగిపదార్థాలను జీర్ణం అవడానికి సాయం చేస్తుంది.
రాత్రిపూట పాలతో రాగిజావ..
నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలు తాగడం ఆరోగ్యకరమైన అలవాట్లలో ఒకటి. కానీ మీరు పాలతో రాగిజావాని కలిపి తాగితే ఏం జరుగుతుందో తెలుసా.. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిద్రించడానికి ముందు రాగితో చేసిన ఆహారాలను తినకూడదు. కానీ పాలతో రాగిజావాని కలుపుకొని తాగవచ్చు. ఇలా చేయడం వల్ల మెదడు వేగంగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొన్నారు. ఇది మీ జీవక్రియను పెంచడంతో పాటు బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.