
దక్షిణ భారతదేశంలో పనస వినియోగం చాలా ఎక్కువ. ముఖ్యంగా కేరళలో వందల రకాల పనస చెట్లు ఉన్నాయి. సాధారణంగా పనసకాయతో కూరలు, వేపుళ్లు, చిప్స్, అప్పడాలు, స్వీట్లు తయారు చేయడం మనకు తెలిసిందే. అయితే బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసర్చ్ (IIHR) పనసపై పలు పరిశోధనలు చేసి సరికొత్త ఉత్పత్తులను మార్కెట్‌కు పరిచయం చేసింది.
పనస గుజ్జుతో జ్యూస్, చాక్లెట్లు, బిస్కెట్లను రూపొందించింది. ఇందులో ఎలాంటి చక్కెర గానీ, ప్రిజర్వేటివ్స్ (నిల్వ పదార్థాలు) గానీ ఉపయోగించకపోయినా, ఆరు నెలల వరకు పాడవకుండా నిల్వ ఉండేలా శాస్త్రవేత్తలు దీనిని తయారు చేయడం విశేషం. పనస గింజల పిండితో చేసిన బిస్కెట్లు, గోధుమ పిండితో కలిపిన చాక్లెట్లు కూడా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలుగా ప్రాచుర్యం పొందుతున్నాయి.
కరోనా మహమ్మారి తర్వాత ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన బాగా పెరిగింది. ఈ క్రమంలోనే చాలామంది మాంసాహారానికి బదులుగా పనసను ఉపయోగించడం ప్రారంభించారు. దీంతో పనస బిర్యానీ, పనస కూర, పనస కట్లెట్స్ వంటి వంటకాలకు మార్కెట్లో డిమాండ్ విపరీతంగా పెరిగింది.
పనసకాయకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విభిన్నమైన గుర్తింపు ఉంది. బెంగాల్‌లో పనసను ‘గాచ్ పతా’ అని పిలుస్తారు. అంటే “గొర్రె చెట్టు” అని అర్థం. పనస ముక్కల ఆకృతి, రుచి దాదాపు మటన్‌లా ఉండటంతో ఆ పేరు వచ్చింది. బీహార్‌లో కాలా మటన్ తరహాలో పనస కర్రీ వండుతారు. అలాగే గోవాలో కొన్ని రకాల సాంప్రదాయ వంటల్లో చేపలకు బదులుగా పనస ముక్కలను ఉపయోగించడం విశేషం. మన తెలుగు రాష్ట్రాల్లో పనస పొట్టు ఆవకూర, పనసకాయ బిర్యానీ, పనస గింజల వేపుడు వంటివి ప్రత్యేక రుచులుగా ఎంతో గుర్తింపు పొందాయి.
ఆరోగ్యానికి రక్షణ కవచంలా నిలిచే ఎన్నో పోషకాలు పనసలో దాగున్నాయి. దీనిని క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే.
కేవలం ఒక సాధారణ ఫలంగానే కాకుండా, బిర్యానీలు, స్నాక్స్, హెల్తీ చాక్లెట్ల రూపంలోనూ అలరిస్తున్న పనసను ఈ వేసవిలో అస్సలు మిస్ అవ్వకండి.