Chicken: రోజూ చికెన్ తింటే శరీరంలో ఏం జరుగుతుంది..? ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..

ప్రోటీన్ అనగానే మనందరికీ మొదట గుర్తొచ్చేది చికెన్.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అంటూ రోజూ చికెన్ లాగించేస్తున్నారా? అయితే అలర్ట్.. చికెన్ తింటే కండరాలు పెరుగుతాయన్నది ఎంత నిజమో.. కేవలం చికెన్ పైనే ఆధారపడితే కొన్ని పోషక లోపాలు తప్పవన్నది కూడా అంతే నిజం. రోజువారీ డైట్‌లో దీనివల్ల కలిగే లాభనష్టాలేంటి? అనేది తెలుసుకుందాం..

Chicken: రోజూ చికెన్ తింటే శరీరంలో ఏం జరుగుతుంది..? ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..
Is Eating Chicken Every Day Good For Health 1

Updated on: Jan 23, 2026 | 11:15 AM

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో శరీరానికి అవసరమైన ప్రోటీన్ పొందడానికి చాలా మంది ఎంచుకునే సులభమైన, చౌకైన మార్గం చికెన్. సలాడ్లు, సూప్‌లు, టాకోల నుండి బిర్యానీల వరకు చికెన్ లేనిదే ముద్ద దిగని వారు చాలా మందే ఉన్నారు. అయితే చికెన్ ఆరోగ్యానికి మంచిదేనా? దీన్ని ప్రతిరోజూ తినడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేదానిపై ప్రముఖ పోషకాహార నిపుణులు మెకెంజీ బర్గెస్ కీలక విషయాలు వెల్లడించారు.

చికెన్ ఎందుకు సూపర్ ప్రోటీన్?

చికెన్‌ను హై-క్వాలిటీ ప్రోటీన్ అని పిలుస్తారు. మన శరీరానికి అవసరమైన 20 అమైనో ఆమ్లాలలో, శరీరం స్వయంగా తయారు చేసుకోలేని 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలు చికెన్‌లో సంపూర్ణంగా లభిస్తాయి. కేవలం 4 ఔన్సుల చికెన్ ద్వారా 35 గ్రాముల లీన్ ప్రోటీన్ అందుతుంది. ఇది కణాల మరమ్మత్తుకు, కండరాల పెరుగుదలకు దోహదపడుతుంది. చికెన్ ద్వారా లభించే బి విటమిన్లు మెదడు పనితీరుకు మరియు శక్తి ఉత్పత్తికి ఎంతో అవసరం. ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. దీనివల్ల అనవసరమైన ఆహారం తీసుకోకుండా బరువు తగ్గవచ్చు.

బ్రెస్ట్ పీస్ vs లెగ్ పీస్: ఏది బెస్ట్?

చాలా మంది రుచి కోసం తొడ భాగం ఇష్టపడతారు. కానీ పోషకాల పరంగా తేడాలు ఉన్నాయి. చికెన్ బ్రెస్ట్‌లో కేలరీలు తక్కువ, ప్రోటీన్ ఎక్కువ. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. చికెన్ లెగ్‌లో ఇందులో కొవ్వు, సోడియం ఎక్కువగా ఉంటాయి, కానీ రుచి పరంగా ఇది ముందుంటుంది.

ఇవి కూడా చదవండి

ప్రతిరోజూ తింటే వచ్చే సమస్యలు ఏంటి?

చికెన్ గొప్ప ఆహారమే అయినప్పటికీ కేవలం దానిపైనే ఆధారపడటం వల్ల కొన్ని పోషక లోపాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చికెన్ బ్రెస్ట్‌లో కొవ్వు చాలా తక్కువ. కాబట్టి శరీరానికి అవసరమైన ఒమేగా-3 వంటి కొవ్వుల కోసం ఆలివ్ ఆయిల్ లేదా అవకాడోలను జత చేయాలి. కేవలం చికెన్ మాత్రమే తింటే ఫైబర్, ఐరన్, పొటాషియం వంటివి అందవు. ‘‘వారమంతా కేవలం చికెన్ మాత్రమే కాకుండా, ప్రోటీన్ కోసం సాల్మన్ చేపలు, గుడ్లు, పెరుగు వంటి జంతు వనరులతో పాటు.. టోఫు, పప్పుధాన్యాలు, గింజల వంటి మొక్కల ఆధారిత ఆహారాన్ని కూడా తీసుకోవాలి. అప్పుడే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి’’ అని బర్గెస్ సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..