Papaya Side Effects: ఈ వ్యాధులతో బాధపడేవారు బొప్పాయి తినకూడదు.. చాలా దుష్ప్రభావాలు..?

|

Feb 06, 2022 | 8:15 PM

Papaya Side Effects: బొప్పాయి చాలా మంది ఇష్టపడే పండు. ఇందులో కేలరీలు తక్కువగా పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పండుని ఆహారంలో భాగం చేసుకోవాలని

Papaya Side Effects: ఈ వ్యాధులతో బాధపడేవారు బొప్పాయి తినకూడదు.. చాలా దుష్ప్రభావాలు..?
Papaya
Follow us on

Papaya Side Effects: బొప్పాయి చాలా మంది ఇష్టపడే పండు. ఇందులో కేలరీలు తక్కువగా పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పండుని ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తారు. బొప్పాయి తినడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలు దూరంగా ఉంటాయి. బొప్పాయిలో ఫైబర్, కెరోటిన్, విటమిన్ సి, ఈ, ఎ అనేక ఇతర ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బొప్పాయిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది అలాగే విటమిన్ ఎ కూడా తగినంత పరిమాణంలో ఉంటుంది. ఇది కంటి చూపును పెంచడంలో సహాయపడుతుంది. బొప్పాయిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కానీ కొన్ని వ్యాధులు ఉన్నవారు బొప్పాయి తినకూడదు.

1. కామెర్లు

కామెర్లు వంటి తీవ్రమైన వ్యాధితో బాధపడేవారు పొరపాటున కూడా బొప్పాయి తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. బొప్పాయిలో ఉండే పపైన్, బీటా కెరోటిన్‌లు కామెర్ల వ్యాధిని మరింత పెంచుతాయని చెబుతున్నారు. అయితే బాధిత వ్యక్తి బొప్పాయిని తినాలంటే దానికంటే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.

2. జీర్ణక్రియ

పరిమితికి మించి ఏదైనా తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. మీరు బొప్పాయిని అధికంగా తీసుకుంటే జీర్ణక్రియ అధ్వాన్నంగా ఉంటుంది. బొప్పాయిలో ఉండే పీచు ఎక్కువగా శరీరంలోకి వెళితే కడుపు నొప్పి, మంట, గ్యాస్ సమస్యలు వస్తాయి. బొప్పాయితో మలబద్ధకం తొలగిపోయినప్పటికీ అతిగా తినడం వల్ల విరేచనాల సమస్య ఏర్పడుతుంది.

3. బీపీ సమస్య

బీపీ సమస్య ఉన్నవారు బొప్పాయిని ఎక్కువగా తినకూడదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బొప్పాయిని అధికంగా తినడం వల్ల గుండె కొట్టుకోవడం మందగిస్తుంది. అయితే బాధిత వ్యక్తి బొప్పాయిని తినాలంటే దానికంటే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.

4. చర్మ అలెర్జీలు

మీరు చాలా కాలంగా అలెర్జీని ఎదుర్కొంటున్నట్లయితే బొప్పాయి తినడం హానికరం. ఎందుకంటే బొప్పాయి అలర్జీ సమస్యని మరింత పెంచుతుంది. ఇది చర్మంపై దద్దుర్లు లేదా ఇతర సమస్యలను కలిగిస్తుంది.

5. రాళ్ల సమస్య

పొట్టలో రాళ్ల సమస్య ఉన్నవారు బొప్పాయి తక్కువ తినాలని చెబుతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీలో రాళ్లతో బాధపడేవారి ఇబ్బందిని మరింత పెంచుతాయి.

Socks: రాత్రిపూట సాక్స్‌ ధరించి పడుకుంటున్నారా.. చాలా ప్రమాదం ఎందుకంటే..?

Paratha Offer: 32 అంగుళాల పరోటా.. తింటే లక్ష రూపాయల బహుమతి..?

Viral Photos: ప్రపంచంలో ఈ 5 రకాల చేపలు ప్రాణాంతకం.. క్షణాల్లో మనిషి ప్రాణాలు తీస్తాయి..?